Karnataka High Court: పిటిషనర్ మరణించినా అతని ఆస్తిని పొందిన వారసులు జరిమానా చెల్లించాల్సిందే, కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు
మృతుని ఆస్తి నుండి లేదా అతని మరణానంతరం వారసత్వంగా పొందిన వారసుల ఆస్తి నుండి జరిమానా వసూలు చేయవచ్చని పేర్కొంది.
చనిపోయిన వారి నుండి జరిమానా వసూలు చేసే విషయంలో కర్నాటక హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. మృతుని ఆస్తి నుండి లేదా అతని మరణానంతరం వారసత్వంగా పొందిన వారసుల ఆస్తి నుండి జరిమానా వసూలు చేయవచ్చని పేర్కొంది.హాసన్‌కు చెందిన దివంగత తొట్టిలే గౌడ వేసిన పిటిషన్‌ను విచారించిన జస్టిస్ శివశంకర్ అమరన్నవర్ నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. తాను జీవించి ఉన్నప్పుడే ఈ పిటిషన్‌ను సమర్పించారు. తన ఆదేశాలను ధిక్కరించినందుకు కర్ణాటక హైకోర్టు తండ్రికి రూ. 25,000 జరిమానా విధించింది.ఈ కేసులో తల్లికి బిడ్డను కస్టడీకి ఇచ్చింది.
అయితే పిటిషనర్ మరణించాడు. ఈ నేపథ్యంలో ఆయన మరణించినా కోర్టు ఆదేశాల మేరకు జరిమానా చెల్లించే బాధ్యత నుంచి మినహాయింపు పొందబోరని ధర్మాసనం పేర్కొంది. కేసును కొనసాగించాలని పిటిషనర్ మరణించిన తర్వాత కుటుంబ సభ్యులెవరూ పిటిషన్ సమర్పించలేదు. దివంగత తొట్టిలే గౌడ తరఫు న్యాయవాది చట్టపరమైన వారసులు పిటిషన్‌ను కొనసాగించడానికి ఇష్టపడరని పేర్కొన్నారు. ఆస్తి పొందిన వారసుడు జరిమానా మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుందని ధర్మాసనం పేర్కొంది.