Pigs in COVID-19 Hospital: కరోనా ఆస్పత్రిలో యథేచ్ఛగా తిరుగుతున్న పందులు, చర్యలు తీసుకున్నామని తెలిపిన కర్ణాటక రాష్ట్ర ఆరోగ్య మంత్రి శ్రీరాములు
ఈ సంగతి తెలియగానే వాటి యజమానిపై కేసు నమోదు చేయాలని పోలీసులను గుల్బర్గా డిప్యూటీ కమిషనర్ ఆదేశించారు. దీనిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రియాంక్ ఖర్గే మాట్లాడుతూ రాష్ట్ర డిప్యూటీ సీఎం గోవింద్ ఎం కర్జోల్ జిల్లాను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. రాష్ట్ర ఆరోగ్య మంత్రి బీ శ్రీరాములు మాట్లాడుతూ ‘ఇది మూడు రోజుల క్రితం వీడియో. తక్షణం చర్య తీసుకోవాలని ఆదేశించాను’ అని చెప్పారు.
Bengaluru, July 20: కర్ణాటకలోని కలబురగి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ రంగ కొవిడ్-19 ఆస్పత్రిలో నల్ల పందుల గుంపు (Pigs in COVID-19 Hospital) స్వేచ్ఛగా నడుచుకుంటూ వెళుతున్న వీడియో ఒకటి వెలుగుచూసింది. ఈ సంగతి తెలియగానే వాటి యజమానిపై కేసు నమోదు చేయాలని పోలీసులను గుల్బర్గా డిప్యూటీ కమిషనర్ ఆదేశించారు. దీనిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రియాంక్ ఖర్గే మాట్లాడుతూ రాష్ట్ర డిప్యూటీ సీఎం గోవింద్ ఎం కర్జోల్ జిల్లాను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. రాష్ట్ర ఆరోగ్య మంత్రి బీ శ్రీరాములు మాట్లాడుతూ ‘ఇది మూడు రోజుల క్రితం వీడియో. తక్షణం చర్య తీసుకోవాలని ఆదేశించాను’ అని చెప్పారు. నాలుగు రోజుల్లో 1.30 లక్షల కరోనా కేసులు నమోదు, దేశంలో 11 లక్షలు దాటిన కోవిడ్-19 కేసులు, 27,497కు చేరుకున్న మరణాలు
సుమారు 50 పందులు ఆసుపత్రిలోని కోవిడ్-19 పేషెంట్లు చికిత్స పొందుతున్న పరిసరాల్లో ( Kalaburagi COVID-19 Hospital) కలియతిరిగాయి. డాక్టర్లు, ఆసుపత్రికి వచ్చిన వార్డుల్లోనే పందులు తిరుగుతున్న కారిడార్‌లోనే ఉండడం గమనార్హం. ఆసుపత్రి యాజమాన్యం ఎంత నిర్లక్ష్యంగా ఉందో దీనికి సంబంధించిన వీడియో చూస్తే తెలుస్తుంది. ఈ వీడియోపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Here's the video of pigs roaming at GIMS, Kalaburagi:
రోగుల పట్ల, శుభ్రత పట్ల ఆసుపత్రి యాజమాన్య నిర్లక్ష్యం మొత్తం కనిపిస్తోందని వారు మండిపడుతున్నారు. మరోవైపు కర్ణాటకలోని పలు ప్రభుత్వ ఆసుపత్రుల తీరు ఈ వీడియోలో సుస్పష్టంగా కనిపిస్తుందని కామెంట్లు పెడుతున్నారు. కాగా కర్ణాటకలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 60వేలకు దగ్గర్లో ఉంది. ఇక ఈ వైరస్ సోకి కర్ణాటకలో వెయ్యి మందికి పైగా మృత్యువాతపడ్డారు.