New Delhi, July 20: దేశంలో ప్రతిరోజు 34 వేలకు కేసులు (Coronavirus in India) నమోదవుతుండటంతో నాలుగు రోజుల్లోనే 1.30 లక్షల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశంలో కరోనా కేసులు 11 లక్షల మార్కును దాటాయి. తాజాగా గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో కొత్తగా 40,425 మందికి కరోనా వైరస్ సోకింది. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య (coronavirus tally in India) 11,18,043కు చేరింది. ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసుల్లో 3,90,459 కేసులు యాక్టివ్‌గా ఉండగా, మరో 7,00,087 మంది బాధితులు కోలుకుని దవాఖానల నుంచి డిశ్చార్జి అయ్యారు. క్వారంటైన్‌లో కామాంధుడి పైశాచికం, 40 ఏళ్ల మహిళపై అత్యాచారం, నిందితుడికి కరోనా పాజిటివ్, బాధితురాలికి నెగిటివ్
అదేవిధంగా కరోనా వైరస్‌తో కొత్తగా 681 మంది మరణించారు. దీంతో దేశంలో మొత్తం కరోనా మృతుల సంఖ్య (Coronavirus Deaths) 27,497కు చేరింది. జూలై 19వరకు దేశంలో 1,40,47,908 మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ (ఐసీఎమ్మార్) ప్రకటించింది. ఆదివారం 2,56,039 నమూనాలను పరీక్షించామని వెల్లడించింది. మరోవైపు దేశంలో కరోనా పరిస్థితులపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం రాత్రి ఆరా తీశారు. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఫోన్ చేసి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కల్లోలం, ఒక్కరోజులోనే రికార్డ్ స్థాయిలో 5 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు, రాష్ట్రంలో 50 వేలకు చేరువైన కొవిడ్ బాధితుల సంఖ్య
ప్రపంచవ్యాప్తంగా యూరప్ దేశాల్లో కాస్త తగ్గుముఖం పట్టినప్పటికీ అమెరికా, బ్రెజిల్, భారత్‌లలో రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా నిన్న ఒక్కరోజే ప్రపంచవ్యాప్తంగా 2లక్షల 59వేల 848 పాజిటివ్ కేసులు నమోదైనట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. అంతకు ముందురోజు కూడా 2లక్షల 37వేల 743 పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి. 24గంటల్లో ఈ స్థాయిలో కేసులు నమోదుకావడం ఆందోళన కలిగిస్తోంది. కేవలం అమెరికాలోనే 24గంటల్లో 71వేల 484 పాజిటివ్ కేసులు నమోదు కాగా, బ్రెజిల్‌లో 45వేలు, దక్షిణాఫ్రికాలో 13వేల కేసులు నమోదైనట్లు డబ్ల్యూహెచ్‌ఓ తెలిపింది. భారత్‌లో శనివారం ఒక్కరోజే దాదాపు 39వేలు కేసులు, ఆదివారం ఒక్కరోజే 40వేల 425 కొత్త కేసులు బయటపడ్డాయి.
నిన్న ఒక్కరోజే ప్రపంచవ్యాప్తంగా 7వేల 360 మరణాలు చోటుచేసుకున్నాయి. దీంతో కొవిడ్-19తో మరణించిన వారిసంఖ్య 6లక్షలు దాటాయి. ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా 6 లక్షల 8వేల 542 మంది కరోనా బాధితులు మరణించారు. అమెరికాలో ఇప్పటివరకు 39లక్షల పాజిటివ్ కేసులు నమోదుకాగా లక్షా 40వేల మంది మృత్యువాతపడ్డారు. కరోనా కేసుల్లో రెండో స్థానంలో ఉన్న బ్రెజిల్‌లో ఇప్పటివరకు 20లక్షల పాజిటివ్ కేసులు బయటపడగా 78వేల మంది కరోనా రోగులు ప్రాణాలు కోల్పోయారు. మూడోస్థానంలో ఉన్న భారత్‌లో బాధితుల సంఖ్య 11 లక్షలు దాటగా, 27వేల 497 మంది ప్రాణాలు కోల్పోయారు.