Navi Mumbai, July 18: కరోనావైరస్ ఓ వైపు కల్లోలం రేపుతుంటే కొందరు మృగాళ్లు ఈ కరోనా పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకుని మహిళలపై అత్యాచారాలకు (Women Raped at Quarantine Center) పాల్పడుతున్నారు. క్వారంటైన్ సెంటర్లను ( COVID19 quarantine centre) వేదికగా చేసుకుని వీరు మహిళలపై అకృత్యాలకు పాల్పడుతున్నారు. ఇప్పటికే ఎన్నో ఘటనలు బయటకు రాగా తాజాగా నవీ ముంబై ఘటన కూడా వెలుగులోకి వచ్చింది. ఫ్రీ వైఫైతో 80 వేల పోర్న్ చిత్రాలను డౌన్‌లోడ్ చేసింది, ఆస్పత్రి బెడ్ మీద నుంచే వీడియోలు చూసింది, యూకేలో పోలీసులకు షాకిచ్చిన ఘటనపై ఓ లుక్కేయండి
వివరాల్లోకెళితే.. మహారాష్ట్రకు చెందిన ఓ మహిళ కోవిడ్-19 లక్షణాలతో బాధపడుతూ.. నవీ ముంబైలోని (Navi Mumbai) క్వారంటైన్ సెంటర్‌లో విశ్రాంతి తీసుకుంటున్నారు. అదే చోట ఉన్న కరోనా పేషెంట్‌ను పరామర్శించే వంకతో అతడి సోదరుడు తరచూ అక్కడికి వచ్చి బాధితురాలితో పరిచయం పెంచుకున్నాడు. కరోనా మీద ఆమెకు ధైర్యం చెబుతూ సాయం చేస్తానని నమ్మిస్తూ వచ్చాడు. ఇలా మాటలు కలిపి ఓ రోజు రాత్రి లైంగిక దాడికి తెగబడ్డాడు.
బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు పన్వేల్ తాలూకా పోలీసులు తెలిపారు. నిందితుడిని అరెస్టు చేసి కోవిడ్-19 పరీక్షలు నిర్వహించగా అతడికి పాజిటివ్ తేలినట్లు వెల్లడించారు. అన్ని జాగ్రత్తలు పాటిస్తూ అతడిని గార్డు పర్యవేక్షణలో ఉంచినట్లు తెలిపారు. మరోవైపు.. బాధితురాలికి కరోనావైరస్ నెగటివ్ వచ్చినట్లు పేర్కొన్నారు.
చికిత్స చేయించుకునేందుకు వచ్చిన బాలికపై గార్డు అత్యాచారం
చికిత్స చేయించుకునేందుకు ఓ బాలిక కొవిడ్-19 క్వారంటైన్ కేంద్రానికి రాగా, అక్కడ ఉన్న గార్డు ఆమెపై అత్యాచారం జరిపిన దారుణ ఘటన బీహార్ రాష్ట్రంలోని పట్నా నగరంలోని వైద్యకళాశాల కొవిడ్-19 క్వారంటైన్ కేంద్రంలో వెలుగుచూసింది. పట్నా మెడికల్ కళాశాల కొవిడ్ ఆసుపత్రిలో మహేష్ ప్రసాద్ గత మూడు నెలలుగా గార్డుగా పనిచేస్తున్నాడు.రాత్రివేళ ఓ బాలిక చికిత్స చేయించుకునేందుకు ఆసుపత్రికి రాగా అక్కడ గార్డు,ఆమెపై అత్యాచారం చేశాడని పోలీసులు చెప్పారు. బాధిత బాలిక ఫిర్యాదు మేర పోలీసులు పోస్కో చట్టం కింద కేసు నమోదు చేశారు. బాలికకు వైద్యపరీక్షలు చేయించామని, రెండు,మూడు రోజుల్లో వైద్యుల నివేదిక వస్తుందని బీహార్ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ దిల్మనీ మిశ్రా చెప్పారు. నిందితుడైన గార్డును అరెస్టు చేశామని పోలీసులు చెప్పారు.