Karnataka Shocker: మద్యం మత్తులో భార్యను వదిలేసి అత్తను దారుణంగా.. విడాకుల కోసం భార్య వేధిస్తుండటంతో సుత్తితో ఆమెను చంపబోయి అత్తను చంపేసిన అల్లుడు
తాగిన మత్తులో భార్యను చంపాల్సిన వ్యక్తి అత్తను చంపేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటక రాష్ట్రంలోని సంజయ్ నగర్‌కు చెందిన నాగరాజ్ అనే వ్యక్తికి ఆరేళ్ల క్రితం భవ్యశ్రీతో వివాహమైంది.
Bengaluru, July 19: కర్ణాటకలో దారుణం చోటు (Karnataka Shocker) చేసుకుంది. తాగిన మత్తులో భార్యను చంపాల్సిన వ్యక్తి అత్తను చంపేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటక రాష్ట్రంలోని సంజయ్ నగర్‌కు చెందిన నాగరాజ్ అనే వ్యక్తికి ఆరేళ్ల క్రితం భవ్యశ్రీతో వివాహమైంది. వీరికి ఐదేళ్ల కూతురు కూడా ఉంది. డ్రైవర్‌గా పనిచేస్తున్న నాగరాజ్‌కు విపరీతంగా మద్యం తాగే అలవాటు ఉంది. నాగరాజ్ వైవాహిక జీవితానికి ఈ వ్యసనం పెనుముప్పుగా మారింది. ఎప్పుడూ మద్యం మత్తులో ఉండే నాగరాజు తరచుగా భార్యతో గొడవ ( family feud) పడేవాడు. ఆమెపై భౌతిక దాడికి పాల్పడేవాడు. అతని గొడవలతో విసిగిపోయిన భవ్యశ్రీ మూడేళ్ల క్రితం పుట్టింటికి వెళ్లిపోయింది. నాగరాజ్‌కు విడాకులు ఇచ్చేందుకు కూడా భవ్యశ్రీ సిద్ధమైంది.
భార్య విడాకులు కోరడంతో నాగరాజ్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. అత్తింటికి వెళ్లి తన భార్యను తనతో పాటు పంపించాలని గొడవ చేశాడు. అతడితో వెళ్లేందుకు భవ్యశ్రీ అంగీకరించలేదు. దీంతో భార్యను సుత్తితో కొట్టి చంపాలనుకున్నాడు. అయితే మద్యం మత్తులో ఉండడంతో తన భార్యపై కాకుండా అత్తగారి తలపై సుత్తితో ఐదారు సార్లు (Man kills mother-in-law) కొట్టాడు. దీంతో ఆమె తీవ్రంగా గాయపడి కుప్పకూలిపోయింది.
వెంటనే ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకుండాపోయింది. చికిత్స పొందుతూ మృతి చెందింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు నాగరాజ్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. తాను భార్యను చంపాలని ప్లాన్ చేశానని, అయితే మద్యం మత్తులో ఉండడంతో అత్తగారు ఎవరో, భార్య ఎవరో తెలియదని నాగరాజ్ పోలీసులకు తెలిపాడు.