Jajpur (Odisha), Jul 18: దేశంలో ఎన్ని చట్టాలు తెచ్చినా మృగాళ్లలో మార్పు రావడం లేదు. మహిళ కనపడితే కామంతో రెచ్చిపోతున్నారు. తాజాగా ఒడిశాలో దారుణ ఘటన (Odisha Shocker) చోటు చేసుకుంది. వర్షం వస్తుందని ఒక భవనం వద్ద తలదాచుకోవడానికి వచ్చిన బాలికపై కామాంధుల కన్నుపడింది. దాన్నుంచి తప్పించుకునే క్రమంలో ఆ బాలిక భవనం పై నుంచి (Girl Jumps Off School Building Roof) దూకేసింది. ఈ దారుణ ఘటన ఒడిశాలోని జైపూర్ లో చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశాలోని కియోంజర్ జిల్లాకు చెందిన ఓ బాలిక తన సోదరుడితో కలసి సోదరి ఇంటికి వెళ్తున్నారు. ఐతే బస్సుదిగి ఇంటికి వెళ్లే క్రమంలో భారీగా వర్షం కురుస్తుండటంతో తలదాచుకునేందుకు అక్కడ ఉన్న ఒక పాఠశాల భవనం వద్ద బస చేశారు. వర్షం తగ్గాక వెళ్దామని అక్కడే కాసేపు ఉన్నారు. ఇంతలో ఐదుగురు వ్యక్తులు వచ్చి బాలిక సోదరుడిని కొట్టి ఆమె పై అత్యాచారం చేసేందుకు యత్నించారు. ఐతే ఆ బాలిక ఆ దుండగుల నుంచి తప్పించుకునే క్రమంలో ( Escape Gang-Rape Bid in Jajpur) పాఠశాల భవనం పై కప్పు ఎక్కి దూకేసింది. దీంతో ఆమెకు తీవ్ర గాయలయ్యాయి.
ఈ మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితురాలి సోదరుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటనకు పాల్పడిన ఆ ఐదుగురు దుండగులను అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. ఆ బాలికను ఒడిశాలోని కళింగ నగర్‌లోని ఆస్పత్రిలో చేర్పించినట్లు తెలిపారు. ప్రస్తుతం ఆ బాలిక పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు.