Karnataka Shocker: ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికపై అత్యాచారం, ఆపై ఉరేసి చంపేశాడు, నిందితునిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్న పోలీసులు, మరో చోట మద్యం మత్తులో తండ్రినే కడతేర్చిన కసాయి కొడుకు
ఆ సమయంలో బాలిక తల్లిదండ్రులు కూలిపనుల కోసం వేరే ఊరికి వెళ్లారు.
Bangalore, August 4: కర్ణాటకలో దారుణం చోటు చేసుకుంది. రాష్ట్రంలోని బెంగళూరు సిటీ మాలూరుతాలూకాలోని మాస్తిలో మైనర్ బాలికను యువకుడు అత్యాచారం చేసి ఉరివేసి చంపాడు. బెంనిగన హళ్లి పంచాయతీ నిడమాకలహళ్లి గ్రామంలో 16 ఏళ్ల బాలికను అదే గ్రామవాసి మంజునాథ్ (27) అనే యువకుడు (Karnataka Shocker) ఇంట్లో ఒక్కరే ఉండగా వచ్చి అత్యాచారానికి ఒడిగట్టాడు. ఆ సమయంలో బాలిక తల్లిదండ్రులు కూలిపనుల కోసం వేరే ఊరికి వెళ్లారు.
అత్యాచారం అనంతరం నేరం బయటపడుతుందని యువకుడు బాలికను ఇంట్లోనే చీరతో పైకప్పు కొక్కేనికి ఉరివేసి (Minor Girl Molested And Assassinated) చంపినట్లు పోలీసులు చెప్పారు. నిందితునికి పెళ్లయి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. బెంగళూరులో చిన్న ఉద్యోగం చేస్తూ కరోనా వల్ల వదిలేసి వచ్చాడు. హత్య విషయం తెలిసి బాలిక తల్లిదండ్రులు, గ్రామస్తులు నిందితుని ఇంటి ముందు ధర్నా చేశారు. దీంతో డీఎస్పీ రమేశ్, సీఐ వసంత్, ఎస్‌ఐ అనిల్ వెళ్లి నిందితునిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.
ఇక ఒడిశాలోని మల్కన్‌గిరిలో మద్యం మత్తులో ఏకంగా తన తండ్రినే పొట్టన పెట్టుకున్నాడో ప్రబుద్ధుడు. సోమవారం రాత్రి బాగా మద్యం తాగి ఇంటికి వచ్చిన జిల్లాలోని మల్కన్‌గిరి సమితి, పలకొండ గ్రామానికి చెందిన ఇంగ మడకామి.. తన తండ్రి బీమా మడకామితో ఆస్తి విషయమై గొడవపడ్డాడు. ఇది క్రమక్రమంగా పెరిగి ఒకరినొకరు నెట్టుకునేంత వరకు వచ్చింది. ఈ క్రమంలో ఒకానొక దశలో కోపోద్రేకుడైన ఇంగ మడకామి తన తండ్రి తలపై కర్రతో బలంగా కొట్టాడు. దీంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిన బీమా మడకామి కాసేపటికి ప్రాణాలు విడిచాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి, జైలుకి తరలించారు. ప్రస్తుతం పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్రాస్పత్రికి మృతదేహం తరలించినట్లు పోలీసులు తెలిపారు.