Karnataka Shocker: దారుణం, భర్త మర్మాంగాలను ప్రియుడితో నలిపించి హత్య చేయించిన భార్య, బెంగుళూరులో వివాహేతర సంబంధం మోజులో కిరాతకం, నిందితులను అరెస్ట్ చేసిన యలహంక పోలీసులు
బెంగళూరు యలహంక (Yelahanka ) పోలీస్‌స్టేషన్ పరిధిలో వివాహేతర సంబంధం మోజులో తాళికట్టిన భర్తనే ప్రియునితో కలిసి హత్య చేయించింది ఓ కసాయి భార్య.
Yelahanka, Oct 27: బెంగళూరు యలహంక (Yelahanka ) పోలీస్‌స్టేషన్ పరిధిలో వివాహేతర సంబంధం మోజులో తాళికట్టిన భర్తనే ప్రియునితో కలిసి హత్య చేయించింది ఓ కసాయి భార్య. శుక్రవారం రాత్రి యలహంకలోని కొండప్ప లేఔట్లో ఓ మేడపై చంద్రశేఖర్ (35) అనే నేత కార్మికుడు తల, మర్మావయవాలపై తీవ్ర గాయాలతో హత్యకు (Woman, lover held for murdering husband) గురయ్యాడు. ఈ కేసులో పోలీసులు దర్యాప్తు చేపట్టగా అతని భార్య ప్రమేయముందని వెల్లడైంది. దీంతో భార్య శ్వేత (19), ఆమె ప్రియుడు సురేశ్ (22)ని బుధవారం అరెస్ట్ (Arrested)చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..పుట్టపర్తి జిల్లాలోని హిందూపురంకు చెందిన నిందితురాలు శ్వేతకు అదే నగరానికి చెందిన చంద్రశేఖర్‌కు నాలుగేళ్ల క్రితం వివాహమైంది. వీరు అక్కడ నేత పని చేసేవారు. చంద్రశేఖర్ కంటే శ్వేత 16 ఏళ్ల చిన్నది. అయితే అక్క కుమార్తె అనే కారణంతో కుటుంబసభ్యులు ఇద్దరికీ బలవంతంగా వివాహం చేశారు. పెళ్లయిన తరువాత శ్వేత చదువుకోవడానికి హిందూపురంలో కాలేజీకి వెళ్లింది. అక్కడ స్నేహితులతో కలిసి ఆమె బయట ప్రదేశాలకు వెళుతుందని భర్త తరచూ గొడవపడేవాడు.
దీంతో కుటుంబసభ్యులు 4 నెలల కిందటే దంపతుల మధ్య రాజీ చేసి హిందూపురం నుంచి యలహంక కొండప్పలేఔట్ లో ఉండాలని ఇక్కడకు పంపించారు.అయితే శ్వేత హిందూపురానికి చెందిన ప్రియుడు సురేశ్‌తో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది.సురేశ్ అప్పుడప్పుడు శ్వేత ఇంటికి వచ్చివెళ్లేవాడు. ఈ విషయం భర్తకు తెలియడంతో మళ్లీ ఘర్షణ పడ్డారు.
ఈ నేపథ్యంలోనే శ్వేత, సురేశ్ కలిసి తమకు అడ్డుగా ఉన్న చంద్రశేఖర్‌ను తొలగించుకోవాలనుకున్నారు. సురేశ్ 22వ తేదీన బెంగళూరుకు వచ్చాడు. చంద్రశేఖర్ ఇంట్లోనే ఉన్నాడని శ్వేత ఫోన్ చేయడంతో సురేశ్ వచ్చి చంద్రశేఖర్‌ను కలిశాడు, మీతో మాట్లాడాలంటూ మేడపైకి తీసుకెళ్లి అతనితో గొడవపడ్డాడు. సురేశ్ పక్కనే ఉన్న ఇటుక తీసుకుని చంద్రశేఖర్ తలపై దాడిచేశాడు. చంద్రశేఖర్ తీవ్ర రక్తస్రావంతో కిందపడిపోయాడు. ఇదే సమయంలో లవర్ అతని మర్మావయవాలపై పొడిచి చంపి అక్కడి నుంచి ఉడాయించాడు.
ఈ ఘటనపై సమాచారం అందిన వెంటనే యలహంక పోలీసులు చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేశారు. ఎవరు హత్య చేశారు అని భార్యను ప్రశ్నించగా తనకు తెలియదని, ఎవరో ముగ్గురు వ్యక్తులు వచ్చి వెళ్లారని పొంతన లేని చెప్పింది. ఆమెపై అనుమానంతో పోలీస్‌స్టేషన్ కు తీసుకెళ్లి తమదైన శైలిలో విచారించగా ప్రియుడు సురేశ్‌తో కలిసి హత్య చేసినట్లు నోరువిప్పింది. పోలీసులు ముమ్మర గాలింపు జరిపి పరారీలో ఉన్న సురేశ్‌ను కూడా అరెస్ట్ చేసి కేసు విచారణ చేపట్టారు.