Representational Image (Photo Credits: ANI)

Bengaluru, Oct 25: కర్ణాటకలో ఈ మధ్య కాలంలో ఓ సాధువు అనుమానాస్పద మృతిని మరిచిపోక ముందే మరో సాధువు అనుమానాస్పదంగా మృతి సంఘటన వెలుగులోకి వచ్చింది. రాష్ట్రంలోని రామనగర జిల్లాలోని శ్రీ కంచగుల్ మఠానికి చెందిన సంత్ బసవలింగ స్వామి.. మఠంలోని ఓ గదిలో శవమై (Lingayat seer found dead) కనిపించడంతో కలకలం చెలరేగింది. ఆ గదిలో రెండు పేజీల నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనుమానాస్పద మృతిగా (suspected case of suicide) పేర్కొంటూ కుదూర్‌ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.

సోమవారం ఉదయం దర్శనం కోసం వచ్చిన భక్తులు మఠం తలుపులు తెరవకపోవడంతో అనుమానం వ్యక్తం చేశారు. స్థానికుల సాయంతో తలుపులు పగలగొట్టగా సాధువు మరణం బయటపడింది. సమాచారం అందుకున్న కుదూర్‌ పోలీసులు స్వామిజీ మృతదేహాన్ని ఆస్పత్రికు తరలించి సాధువు గదిలో రెండు పేజీల నోట్‌ను స్వాధీనపర్చుకన్నారు. పరువు తీస్తామంటూ కొంత మంది వ్యక్తులు బెదిరిస్తున్నట్లు ఆ నోట్‌లో స్వామీజీ రాసినట్లుగా సమాచారం.

యూపీలో దారుణం, యువతి రక్తంతో రోడ్డు మీద పడి ఉంటే సెల్ఫీలు దిగుతూ చోద్యం చూసిన స్థానికులు,బాధితురాలిని భుజం మీద వేసుకుని ఆస్పత్రికి తీసుకువెళ్లిన పోలీస్

అతి పురాతనమైన ఈ మఠంలో గత 25 సంవత్సరాలుగా బసవలింగ స్వామి దర్శనమిస్తున్నారు. రామనగర పోలీసులు అసహజ మరణంగా కేసు నమోదు చేసి సాధువు మృతిపై దర్యాప్తు ప్రారంభించారు.ఇక కర్ణాటక బెల్గాంలోని శ్రీ గురు మడివళేశ్వర మఠంలో రెండు నెలల క్రితం బసవ సిద్దలింగ స్వామి మృతదేహం లభ్యమైంది. శిష్యులు మఠం గదిని తెరిచి చూడగా సిద్దలింగం మృతదేహం ఉరికి వేలాడుతూ కనిపించింది. లింగాయత్ మఠంలో లైంగిక వేధింపులకు సంబంధించిన ఆడియోలో తన పేరు కనిపించడంపై ఆ స్వామీజీ కలత చెంది ఉంటాడని అప్పట్లో ఊహాగానాలు వినిపించాయి.