Covid Patient Raped by Driver: కరోనా రోగిపై అంబులెన్స్‌లోనే అత్యాచారం, కేరళ రాష్ట్రం పఠాన్ మిట్టలో దారుణమైన సంఘటన, చర్యలు తీసుకోవాలని ఆదేశించిన కేరళ ప్రభుత్వం

చివరకు కరోనా సోకిన మహిళా రోగులను సైతం కాటేస్తున్నారు. కోవిడ్ – 19 బారిన పడిన మహిళను (coronavirus patient) ఆసుపత్రికి తీసుకెళుతుండగా..అంబులెన్స్ లో ఓ డ్రైవర్ అత్యాచారం (Covid-19 patient raped by ambulance drive) జరిపాడు. ఈ దారుణ ఘటన కేరళ రాష్ట్రంలో చోటు చేసుకుంది.

Image used for representational purpose | (Photo Credits: ANI)

Pathanamthitta, Sep 6: కామాంధులు ఎవర్నీ వదలడం లేదు. చివరకు కరోనా సోకిన మహిళా రోగులను సైతం కాటేస్తున్నారు. కోవిడ్ – 19 బారిన పడిన మహిళను (coronavirus patient) ఆసుపత్రికి తీసుకెళుతుండగా..అంబులెన్స్ లో ఓ డ్రైవర్ అత్యాచారం (Covid-19 patient raped by ambulance drive) జరిపాడు. ఈ దారుణ ఘటన కేరళ రాష్ట్రంలో చోటు చేసుకుంది. కేరళలోని పఠాన్ మిట్ట జిల్లాకు చెందిన 19 ఏళ్ల యువతి కరోనా బారిన పడింది. ఆ యువతిని ఐసోలేషన్ కేంద్రానికి తరలించేందుకు అంబులెన్స్ వచ్చింది. ఆ యువతితో పాటుగా మరో మహిళా, ఇద్దరు సిబ్బంది కూడా అంబులెన్స్ లో ఉన్నారు.

అయితే, మహిళను ఓ ఐసోలేషన్ కేంద్రం వద్ద దించిన డ్రైవర్, అక్కడి నుంచి అంబులెన్స్ ను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం (Kerala Rape) చేశాడు. తరువాత యువతిని మరో ఐసోలేషన్ ప్రాంతంలో దించి వెళ్ళిపోయాడు. బాధిత యువతి జరిగిన విషయాన్ని అధికారులతో చెప్పింది. ఈ విషయంపై ఆరోగ్యశాఖ స్పందించింది. అంబులెన్స్ డ్రైవర్ ను విధుల నుంచి తొలగించడమే కాకుండా, అతనిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది.

కరోనా పేషెంట్లకు మరో ముప్పు, వారి బాడీలోకి మలేరియా, డెంగ్యూ వంటి సీజనల్ వ్యాధుల వైరస్, ఆశ్చర్యపోతున్న వైద్యులు

సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. డ్రైవర్ Noufal ను అదుపులోకి తీసుకున్నట్లు, Pathanamthitta జిల్లా పోలీసు సూపరిటెండెంట్ కె.జి. సైమన్ తెలిపారు. బాధితురాలి నుంచి సేట్మెంట్ రికార్డు చేశారు. 2019లో నమోదైన ఓ హత్య కేసులో నిందితుడిగా ఉన్నాడని పోలీసులు తెలిపారు. ఘటనపై కేరళ ఆరోగ్య శాఖ మంత్రి కేకే శైలజ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. డ్రైవర్‌ను వెంటనే విధుల నుంచి తొలగించాలని 108 సర్వీస్ భాగస్వామి సంస్థకు సూచించారు. ‘ఇదొక షాకింగ్ ఘటన. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరుతున్నాను’ అని ఆమె పేర్కొన్నారు.