Kerala Boat Tragedy: కేరళ బోటు ప్రమాదం, ఒకే కుటుంబానికి చెందిన 12 మంది మృతి, రూ. 10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన సీఎం విజయన్
ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలను సీఎం పినరయి విజయన్ ఇవాళ కలిశారు. బాధిత కుటుంబాలకు 10 లక్షల ఎక్స్‌గ్రేషియా కూడా ఆయన ప్రకటించారు.
కేరళలోని తన్నూర్ ప్రాంతంలోని తూవలతీరం బీచ్ వద్ద బోటు బోల్తాపడిన(Boat Tragedy) ఘటనలో 22 మంది మృతిచెందిన సంగతి విదితమే. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలను సీఎం పినరయి విజయన్ ఇవాళ కలిశారు. బాధిత కుటుంబాలకు 10 లక్షల ఎక్స్‌గ్రేషియా కూడా ఆయన ప్రకటించారు.ఈ ఘటన పట్ల ఆయన జుడిషియల్ విచారణకు ఆదేశించారు.
తిరురంగాండి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బోటు ప్రమాద బాధితులను ఇవాళ ఆయన కలిశారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. ఈ ప్రమాదం ఓ విషాదం అన్నారు. చికిత్స పొందుతున్న వారి ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందన్నారు. ప్రమాద ఘటనపై విచారణ చేపట్టేందుకు నిపుణులతో కూడిన జుడిషియల్ కమీషన్‌ను ఏర్పాటు చేయనున్నట్లు సీఎం చెప్పారు.
ప్రధాని మోదీ కూడా ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. బాధిత కుటుంబాలకు 2 లక్షలు ఇ్వవ్వనున్నట్లు తెలిపారు. కేరళలో ఇవాళ సంతాప దినం పాటిస్తున్నారు. అధికారిక ఈవెంట్లను రద్దు చేశారు. బోటు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 12 మంది మృతిచెందారు. ఆ కుటుంబాన్ని కూడా ఇవాళ సీఎం విజయన్ పరామర్శించారు.