కేరళలోని మలప్పురంలో పర్యాటకులతో వెళ్తున్న పడవ బోల్తా పడిన ఘటనలో మృతుల సంఖ్య 22కు పెరిగింది. ఆదివారం రాత్రి 7 గంటల సమయంలో తానూర్‌లోని పర్యాటక ప్రాంతం తూర్వాల్ తీరమ్ వద్ద ఘటన చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో దాదాపు 40 మంది బోటులో ఉన్నట్లు చెబుతున్నారు. సహాయక చర్యల్లో ఆరుగురిని కాపాడామని యంత్రాంగం తెలిపింది.సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
ఈ విషాధ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. రూ.2లక్షల పరిహారం అందించనున్నట్లు పేర్కొన్నారు. ఈమేరకు ప్రధాని కార్యాలయం ట్వీట్ చేసింది.ఈ బోటు ప్రమాదంపై కేరళ సీఎం పినరయి విజయన్ కూడా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. రెస్క్యూ ఆపరేషన్‌పై జిల్లా అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. మృతుల కుటుంబాలకు, సన్నిహితులకు సంతాపం తెలిపారు.