Bird Flu In Kerala: కేరళను వణికిస్తున్న అంతుచిక్కని వ్యాధులు, ఓ వైపు కరోనా..మరోవైపు బర్డ్ ఫ్లూ, 4 వేల కోళ్లను చంపేయడానికి రంగంలోకి దిగన ప్రత్యేక బృందాలు
పరప్పనగడిలో ఉండే కోళ్లకు ఈ బర్డ్ ఫ్లూ సోకినట్లు గుర్తించారు.
Thiruvananthapuram, Mar 14: ఓ వైపు దేశంలో కరోనా కలకలం నడుస్తుంటే కేరళలో దాంతో పాటుగా బర్డ్ ఫ్లూ భయం (Bird Flu In Kerala) కూడా వెంటాడుతోంది.ఈ నేపథ్యంలో వేల సంఖ్యలో కోళ్లను హననం చేసేందుకు కేరళ ప్రభుత్వం (Kerala government) ఆదేశాలు జారీ చేసింది. పరప్పనగడిలో ఉండే కోళ్లకు ఈ బర్డ్ ఫ్లూ సోకినట్లు గుర్తించారు.
కోళ్లకు బర్డ్ ఫ్లూ వైరస్, 13 వేల కోళ్ల కాల్చివేతకు కేరళ ప్రభుత్వం ఆదేశాలు
కాగా కోజికోడ్, మలప్పురం ప్రాంతాల్లో కోళ్లకు ఏవియన్ ఇన్ ఫ్లూయెంజా సోకినట్లు కేరళ పశుసంవర్దక శాఖ మంత్రి కే.రాజు (K Raju) మొన్న కేరళ అసెంబ్లీలో (Kerala Assembly) ప్రకటించారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం జాగ్రత్త చర్యలు చేపడుతోంది.బర్డ్ ఫ్లూ సోకిన కోళ్లను వేరు చేసేందుకు ప్రత్యేక బృందాలను (special squads) రంగంలోకి దింపింది. బర్డ్ ఫ్లూ మరిన్ని ప్రాంతాలకు వ్యాపించకుండా ప్రత్యేక బృందాలు పని చేస్తున్నాయి. ఇందులో భాగంగానే పరప్పనంగడి ప్రాంతంలో 4 వేల కోళ్లను చంపేయనున్నారు.
Here's ANI Tweet
అయితే పౌల్ట్రీల్లో ఉన్న కోళ్లను చంపేందుకు ప్రభుత్వ అధికారులు కొన్ని దళాలను ఏర్పాటు చేశారు. బర్డ్‌ఫ్లూ కేంద్ర బిందువైన ప్రాంతం నుంచి సుమారు కిలోమీటర్ దూరం వరకు ఉన్న అన్ని పౌల్ట్రీల్లో ఉన్న కోళ్లను కిల్ చేస్తున్నట్లు డిసీజ్ ఇన్‌స్పెక్షన్ ఆఫీసర్ తెలిపారు.
కరోనా చికిత్సకు ఎయిడ్స్ మందులు
కోజికోడ్ ప్రాంతంలో మొత్తం 4,000 పౌల్ట్రీల్లోని కోళ్లను చంపేశారు. బర్డ్ ఫ్లూ సమాచారం కోసం మలప్పురం, తిరురంగడిలో కంట్రోల్ రూమ్‌లను వెటర్నరీ అధికారులు ఏర్పాటుచేశారు. బర్డ్ ఫ్లూ ఉన్నట్టు అనుమానం వస్తే కంట్రోల్ రూమ్‌కి ఫోన్ చేసిన సమాచారం అందజేయాలని కోరారు.
ప్రజల ఆరోగ్య సంరక్షణలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేరళ అటవీ, జంతు సంరక్షణ శాఖ మంత్రి కే రాజు అన్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకూ ఏవియన్ ఫ్లూ మనషుల్లో గుర్తించిన దాఖలాలు లేవన్నారు. దేశంలోనే తొలిసారిగా కేరళలోనే కరోనా కేసులు నిర్ధారణ కాగా, ఈ ముగ్గురు బాధితులు కోలుకుని ఇళ్లకు వెళ్లారు. తాజాగా, మరోసారి కోవిడ్ కేసులు నమోదుకావడంతో ప్రభుత్వం పటిష్టమైన చర్యలు చేపట్టింది.