25 Crore Lottery: లాటరీ గెలిచినప్పటి నుంచి నిద్రలేదు, ఈ డబ్బులు నాకు వద్దు బాబోయ్ అంటున్న కేరళ లాటరీ విజేత, వారం రోజులకే లాటరీ విన్నర్‌కు విరక్తి, బంధువులు, స్నేహితులు గొంతెమ్మ కోరికలు కోరుతున్నారని అసహనం

దీంతో ఇంట్లో నివసించే పరిస్థితి కూడా లేదు. అందుకే నా అవసరాలు తీరేంత డబ్బు మాత్రమే వస్తే బాగుండేది అనిపిస్తుంది. అప్పుడైనా ప్రశాతంగా ఉండేవాడిని. డబ్బులు వచ్చాయని తెలియగానే, నాకు తెలిసిన వాళ్లు చాలా మంది శత్రువులుగా మారుతున్నారు.

credit @ANI Twitter

Thiruvananthapuram, SEP 25: కేరళలో ఇటీవల ఒక ఆటో డ్రైవర్ లాటరీలో (Kerala lottery) రూ.25 కోట్లు గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఓనం బంపర్ లాటరీలో (Bumper lottery) అనూప్ అనే ఆటో డ్రైవర్ రూ.25 కోట్లు గెలుచుకున్నాడు. ఆ సమయంలో ఎంతో ఆనందం వ్యక్తం చేశాడు. అయితే, లాటరీ గెలిచి వారం రోజులు కాలేదు.. తనకు మానసిక ప్రశాంతత కరువైంది అంటున్నాడు. నిద్ర కూడా పట్టడం లేదని బాధపడుతున్నాడు. దీనికి కారణం చెప్పాడు అనూప్. ‘‘లాటరీలో పన్నులు, ఇతర బకాయిలు అన్నీ పోగా రూ.15 కోట్ల వరకు వచ్చే అవకాశం ఉంది. ఒకేసారి ఇంత పెద్ద మొత్తంలో డబ్బు వస్తుండటం వల్ల ఆ డబ్బును ఏం చేయాలో ఇంకా నిర్ణయించుకోలేదు. వచ్చిన డబ్బుల్ని కొద్ది రోజులు బ్యాంకులోనే ఉంచుతాను. అయితే, లాటరీ గెలిచిన ఆనందం రెండు రోజులు మాత్రమే ఉంది. ఆ తర్వాత మనశ్శాంతి కరువైంది, నిద్ర కూడా పట్టడం లేదు (lost peace of mind).

Kerala Lottery: కేరళలో ఓనం లాటరీలో రూ.25 కోట్లు గెలుచుకున్న ఆటో డ్రైవర్, వచ్చిన డబ్బుతో ఏం చేస్తున్నాడో తెలిస్తే షాకే... 

ఎందుకంటే నేను లాటరీ గెలిచిన తర్వాత కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు తమ అవసరాలు తీర్చాలి అంటూ కాల్స్ చేసి ఇబ్బంది పెడుతున్నారు. దీంతో ఇంట్లో నివసించే పరిస్థితి కూడా లేదు. అందుకే నా అవసరాలు తీరేంత డబ్బు మాత్రమే వస్తే బాగుండేది అనిపిస్తుంది. అప్పుడైనా ప్రశాతంగా ఉండేవాడిని. డబ్బులు వచ్చాయని తెలియగానే, నాకు తెలిసిన వాళ్లు చాలా మంది శత్రువులుగా మారుతున్నారు. లాటరీ డబ్బులు ఇంకా నాకు అందలేదు’’ అంటూ అనూప్ వాపోయాడు. ఈ సందర్భంగా బహుమతి తనకు ఎందుకు వచ్చిందా అనిపిస్తోంది అని వ్యాఖ్యానించాడు.



సంబంధిత వార్తలు

Auto Rickshaw Risky Stunts: రెండు చక్రాలపై ఆటోను నడుపుతూ హైదరాబాద్ రోడ్లపై ఆటో వాలా ప్రమాదకర స్టంట్లు (వీడియో)

APSRTC Driver Dance Video: బస్సుముందు డ్యాన్స్ వేసిన ఏపీఎస్ ఆర్టీసీ డ్రైవర్ మళ్లీ విధుల్లోకి, ఆయన డ్యాన్స్‌ను మెచ్చుకున్న నారా లోకేష్, దిగి వచ్చిన అధికారులు

Hyderabad Horror: గచ్చిబౌలిలో అర్థరాత్రి రెచ్చిపోయిన కామాంధులు, డ్యూటీ నుంచి ఇంటికి వెళుతున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగినిని ఆటోలోకి లాక్కెళ్లి ఇద్దరు యువకులు సామూహిక అత్యాచారం

Nobel Prize in Medicine 2024: విక్టర్‌ ఆంబ్రోస్‌, గ్యారీ రవ్‌కున్‌కు నోబెల్‌, మైక్రో ఆర్‌ఎన్‌ఏ, పోస్ట్‌ ట్రాన్‌స్ర్కిప్షనల్‌ జీన్‌ రెగ్యులేషన్‌లో దాని పాత్రను కనుగొన్నందుకు గుర్తింపుగా పురస్కారం