COVID-19 Sub-Strain JN.1 in India: భారత్‌లోకి మళ్లీ కరోనా కొత్త వేరియంట్ ఎంట్రీ, కేరళలో మహిళకు కోవిడ్ కొత్త సబ్‌వేరియంట్ జేఎన్.1 వైరస్, దీని లక్షణాలు ఎలా ఉంటాయంటే..
చైనాలో కరోనా కొత్త సబ్‌వేరియంట్ జేఎన్.1 కేసులు నమోదు కాగా ఇది దేశంలోకి ఎంటర్ అయింది.జేఎన్.1 కేసు కేరళలో (Covid-19 sub-strain JN 1 detected in Kerala) నిర్ధారితమయ్యింది.
Covid-19 sub-strain JN 1 detected in Kerala: భారత్‌లో మళ్లీ కరోనా కొత్త వేరియంట్ (COVID-19 Sub-Strain JN.1 in India) కలకలం రేపుతోంది. చైనాలో కరోనా కొత్త సబ్‌వేరియంట్ జేఎన్.1 కేసులు నమోదు కాగా ఇది దేశంలోకి ఎంటర్ అయింది.జేఎన్.1 కేసు కేరళలో (Covid-19 sub-strain JN 1 detected in Kerala) నిర్ధారితమయ్యింది. దీంతో కేరళ వైద్యశాఖలో మరోమారు ఆందోళనలు కమ్ముకున్నాయి.
79 ఏళ్ల మహిళ నుండి వచ్చిన నమూనా నవంబర్ 18 న RT-PCR పరీక్షలో సానుకూల ఫలితాన్ని అందించింది, ఆమెకు ఇన్ఫ్లుఎంజా లాంటి అనారోగ్యాల (ILI) తేలికపాటి లక్షణాలు ఉన్నాయని , COVID- నుండి కోలుకున్నట్లు పేర్కొంది. ఇంతకుముందు, సింగపూర్‌లో JN.1 సబ్-వేరియంట్‌తో ఒక భారతీయ యాత్రికుడు శరీరంలో ఈ వైరస్ గుర్తించారు. ఆ వ్యక్తి తమిళనాడులోని తిరుచిరాపల్లి జిల్లాకు చెందిన వ్యక్తి అక్టోబర్ 25న సింగపూర్‌కు వెళ్లాడు. తిరుచిరాపల్లి జిల్లా లేదా తమిళనాడులోని ఇతర ప్రాంతాలలో వారిలో స్ట్రెయిన్ కనుగొనబడిన తర్వాత ఈ కేసుల పెరుగుదల కనిపించలేదు. అయితే తాజాగా ఈ వైరస్ మళ్లీ కేరళలో బయటపడటంతో కరోనా మీద మళ్లీ ఆందోళన మొదలయింది.
ఈ కొత్త సబ్‌వేరియంట్‌ను తొలుత లక్సెంబర్గ్‌లో గుర్తించారు. ఆ తర్వాత జేఎన్.1 కేసులు యూకే, ఐస్‌లాండ్, ఫ్రాన్స్, అమెరికాలో కూడా వెలుగు చూశాయి. తాజాగా ఈ సబ్‌వేరియంట్ జేఎన్.1 కేసు భారతదేశంలోనూ వెలుగు చూసింది. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ)తెలిపిన వివరాల ప్రకారం కరోనాకు చెందిన ఈ సబ్‌వేరియంట్ ఓమిక్రాన్ సబ్‌వేరియంట్ బీఏ.2.86 వంశానికి చెందినది.
దీనిని ‘పిరోలా’ అని కూడా అంటారు. శాస్త్రవేత్తలు వెల్లడించిన వివరాల ప్రకారం, జేఎన్.1, బీఏ.2.86 మధ్య ఒకే ఒక మార్పు కనిపిస్తోంది. అదే స్పైక్ ప్రోటీన్‌లో మార్పు. స్పైక్ ప్రోటీన్‌ను స్పైక్ అని కూడా అంటారు. ఇది వైరస్ ఉపరితలంపై చిన్న స్పైక్‌ల మాదిరిగా కనిపిస్తుంది. దీని కారణంగా ఈ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుంది.
జేఎన్.1 లక్షణాలు
సీడీసీ తెలిపిన ప్రకారం కరోనాలోని ఈ కొత్త సబ్‌వేరియంట్ నిర్దిష్ట లక్షణాలు ఇంకా పూర్తి స్థాయిలో కనిపించలేదు. అటువంటి పరిస్థితిలో, దాని లక్షణాలు కోవిడ్-19కు చెందిన ఇతర వేరియంట్లకు ఎంత భిన్నంగా ఉన్నాయో నిర్ధారించడం కష్టం. అందుకే కరోనా సాధారణ లక్షణాలే దీనిలోనూ కనిపించవచ్చంటున్నారు. జ్వరం, నిరంతర దగ్గు, త్వరగా అలసిపోవడం, జలుబు, అతిసారం, తలనొప్పి మొదలైన వాటి విషయంలో జనం అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.
ప్రస్తుతానికి జేఎన్.1కి సంబంధించి ఎటువంటి వివరణాత్మక సమాచారం వెల్లడి కాలేదు. సీడీసీ అంచనాల ప్రకారం ఈ వేరియంట్ కేసులు వేగంగా పెరుగుతుండటాన్ని గమనిస్తే, ఇది మన రోగనిరోధక వ్యవస్థ నుండి సులభంగా తప్పించుకోగలదని అంటున్నారు. ఇతర కరోనా వేరియంట్‌ల కంటే జేఎన్.1 ప్రమాదకరమా కాదా అనే విషయంపై ప్రస్తుతం ఎలాంటి ఆధారాలు లేవని సీడీసీ చెబుతోంది.