Kerala Shocker: కేరళలో దారుణం, భర్తకు ప్రతిరోజూ ఆహారంలో మత్తు మందు కలిపి పెట్టిన భార్య, ఆమె చెప్పిన వివరాలు విని ఖంగుతిన్న పోలీసులు

ఆమె భర్త సతీష్ (38) ఫిర్యాదు మేరకు ఆశా సురేష్ (36)ని పోలీసులు అరెస్ట్ చేశారు.

Representational Image | (Photo Credits: IANS)

Kottayam,Feb 7: కేరళలోని కొట్టాయం జిల్లాలోని పాలా పట్టణానికి చెందిన మహిళ తన భర్త ఆహారానికి మత్తు మందు కలిపిన ఆరోపణలపై అరెస్టు (Kerala Shocker) చేశారు. ఆమె భర్త సతీష్ (38) ఫిర్యాదు మేరకు ఆశా సురేష్ (36)ని పోలీసులు అరెస్ట్ చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొట్టాయం జిల్లాలోని పాలా పట్టణాంలో సతీష్‌ అతని భార్య ఆశా నివశిస్తున్నారు. 2006లో వీళ్ల వివాహం జరిగింది. సతీష్‌ ఒక ఐస్‌క్రీమ్‌ పరిశ్రమలో పరిచేస్తున్నాడు. 2012లో ఈ జంట పాలక్కాడ్‌లో సొంత ఇంటిని కూడా కొనుగోలు చేశారు. అయితే ఆశ.. చిన్ని చిన​ విషయాలకు భర్తతో తరుచు గొడవపడుతూ ఉండేది. గత కొన్ని రోజులుగా తాను బాగా అలిసిపోయి అనారోగ్యానికి గురవుతున్నట్లు సతీష్‌ గమనించాడు. దీంతో అతను వైద్యుడిని సంప్రదించాడు కూడా. అయితే షుగర్‌ లెవల్స్‌ పడిపోవడం వల్ల ఇలా జరుగుతుందని చెప్పాడు.

ఈ మేరకు సెప్టెంబర్‌ 2021 నుంచి ఇంటిలో ఆహారం తినడం మానేశాడు. దీంతో అతని ఆరోగ్యం క్రమంగా మెరుగవ్వడం మొదలైంది. దీంతో అతను తన స్నేహితుడితో తన భార్య ఆహారంలో ఏదైన కలుపుతుందేమోనని సందేహం వ్యక్త చేయడమే కాక తన భార్య నుంచి విషయాన్ని తెలుసుకోవాల్సిందిగా అభ్యర్థించాడు. ఈ మేరకు సతీష్‌ స్నేహితుడు ఆశ వద్దకు వెళ్లి విచారించగా.. తాను ఆహారంలో కొన్ని మందులు కలుపుతున్నట్లు వెల్లడించింది.

వర్చువల్ వరల్డ్‌లో మహిళపై గ్యాంగ్ రేప్, మూడు నుంచి నాలుగు మగ అవతారాలు నా అవతార్‌పై సామూహిక అత్యాచారం చేసి ఫోటోలు తీశారని ఆరోపించిన మహిళ

పైగా ఆ మందుల వివరాలను వాట్సాప్‌లో పంపించింది. అంతేకాక సతీష్‌ ఇంటి సీసీఫుటేజ్‌లో కూడా ఆశా ఏవో మందులు కలుపుతున్నట్లు (Kerala woman held for drugging husband’s food) రికార్డు అయ్యింది. దీంతో సతీష్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఆశా తన భర్త తినే భోజనం, తాగే నీళ్లలో కూడా మందులు కలుపుతున్నట్లు పేర్కొన్నారు. అంతేగాక ఆమెను అరెస్టు చేసి విచారించడం మొదలు పెట్టారు. ఆమె తెలిపిన వివరాలు విని పోలీసులు షాక్ అయ్యారు. తన భర్త సతీష్ ఆస్తిలో తనకు ఏమీ ఇవ్వలేదని, మొత్తం ఆస్తులన్నీ తన కుటుంబ సభ్యులు, సోదరులకు ఇస్తానని చెప్పాడని ఆమె తెలిపింది. దీంతో ఈ పని చేసానని తెలిపింది.