KSRTC Bus Accident: కర్ణాటకలో ఘోర ప్రమాదం, కొండను ఢీకొట్టిన టూరిస్టు బస్, 11 మంది దుర్మరణం, 20 మందికి గాయాలు, విహార యాత్రకు వెళుతుండగా విషాదం
ఈ ఘటన 11 మంది పర్యాటకులు దుర్మరణం పాలయ్యారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. వారిలో ముగ్గురి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు.
Bengaluru, Febuary 16: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం (KSRTC Bus Accident) చోటు చేసుకుంది. ఈ ఘటన 11 మంది పర్యాటకులు దుర్మరణం పాలయ్యారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. మైసూరు నుంచి మంగళూరుకు (Mysore to Mangalore) వెళ్తున్న బస్సు ఉడుపి– చిక్కమగళూరు ఘాట్ రోడ్డు కార్కళ తాలూకా మాళె సమీపంలో శనివారం సాయంత్రం ప్రమాదానికి గురైంది. బస్సు ఘాట్ రోడ్డులో వెళ్తుండగా అదుపు తప్పి కుడివైపు బండరాళ్లను అతివేగంతో బలంగా ఢీకొట్టుకుంటూ దూసుకెళ్లింది.
మృతులందరూ ఓ కార్పొరేట్ సంస్థ ఉద్యోగులు. వారందరూ ఉత్తర కర్ణాటక (North Karnataka) ప్రాంతంలోని పర్యటక ప్రాంతాలను సందర్శించడానికి వెళ్తుండగా.. ఈ ఘటన చోటు చేసుకుంది. మైసూరులోని కార్పొరేట్ సంస్థలో పనిచేస్తోన్న 35 మంది ఉద్యోగులతో కూడిన డీబీ ట్రావెల్స్‌కు (DB Travels) చెందిన బస్సు మంగళూరుకు బయలుదేరి వెళ్లింది. మంగళూరు బీచ్ అక్కడి నుంచి ఉడుపికి (Udipi) వెళ్లాలనేది వారి షెడ్యూల్. మైసూరు నుంచి బయలుదేరిన కొన్ని గంటల్లోనే బస్సు ప్రమాదానికి గురైంది.
Here's ANI Tweet
సాయంత్రం 7 గంటల సమయంలో కర్కల సమీపంలోని ఘాట్ రోడ్డు వద్ద బస్సు అదుపు తప్పింది. కుడి వైపున ఉన్న కొండను ఢీ కొట్టింది. ఈ ఘటనలో కుడి వైపు బస్సు మొత్తం నుజ్జునుజ్జయింది.
కుడివైపున కిటికీ వైపు కూర్చున్న ప్రయాణికులందరూ మరణించారు. తొమ్మిది మంది సంఘటనాస్థలంలోనే మృతిచెందారు. మరో ఇద్దరు ఆసుపత్రిలో కన్నుమూశారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడ్డ వారిని మంగళూరు ఆసుపత్రికి తరలించారు. వారిలో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు.