Lady Aghori Naga Sadhu in AP: ఆత్మార్పణ అంటూ తెలంగాణలో హల్ చల్ చేసిన లేడీ అఘోరీ ఏపీలో ప్రత్యేక్షం.. అర్ధరాత్రి ఆత్మకూరులో ప్రత్యక్షమైన అఘోరీ (వీడియో)

అర్ధరాత్రి ఆత్మకూరులో ప్రత్యక్షమైన అఘోరీ కారును స్థానికులు వెంబడించారు.

Lady Aghori Naga Sadhu in AP (Credits: X)

Hyderabad, Nov 4: ఆత్మార్పణ అంటూ తెలంగాణలో (Telangana) గత కొన్నిరోజులుగా హల్ చల్  చేసిన లేడీ అఘోరీ (Lady Aghori Naga Sadhu Row) ఏపీలో ప్రత్యేక్షమైంది. అర్ధరాత్రి ఆత్మకూరులో ప్రత్యక్షమైన అఘోరీ కారును స్థానికులు వెంబడించారు. దీంతో కారు నిలపకుండా శ్రీశైలం వైపు అఘోరీ వెళ్లినట్టు స్థానికులు తెలిపారు. కాగా, తెలంగాణలో గత కొద్ది రోజులుగా లేడీ అఘోరీ వ్యవహారం హాట్ టాపిక్‌ గా మారింది. సనాతన ధర్మం కోసం సికింద్రాబాదు ముత్యాలమ్మ ఆలయం వద్ద ఆత్మార్పణం చేస్తానని మహిళా అఘోరీ ప్రకటించడం సంచలనంగా మారింది.

టెట్ కు సంబంధించి నేడు రెండు కీలక పరిణామాలు.. మరికాసేపట్లో ఏపీ టెట్‌ ఫలితాలు వచ్చేస్తున్నాయ్‌.. ఇక, నేడే తెలంగాణ టెట్‌ నోటిఫికేషన్‌ విడుదల

Here's Video:

మహారాష్ట్ర నుంచి ఏపీకి..

అఘోరీ ప్రకటన నేపథ్యంలో పోలీసులు మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం కుశ్నపల్లిలోని ఆమె స్వగృహంలో అఘోరీని నిర్బంధించారు. ఆ తర్వాత మహారాష్ట్ర సరిహద్దు వాంకిడి మండలం లకడికోటా వరకు తీసుకెళ్లి అఘోరిని వదిలేశారు. అయితే, ఆమె అటు నుంచి ఏపీలో ప్రవేశించినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ వీడియోలు వైరల్ గా మారాయి.

క్యూఆర్ కోడ్ తో కాకతీయుల చరిత్ర.. చారిత్రక కట్టడాల విశేషాలను తెలుసుకునేందుకే..!



సంబంధిత వార్తలు

Bank Holidays in 2025: బ్యాంక్ సెలవుల జాబితా 2025 ఇదిగో, పండుగల నుండి జాతీయ సెలవులు వరకు బ్యాంక్ సెలవుల పూర్తి జాబితాను తెలుసుకోండి

Heavy Rain Alert For Telugu States: బంగాళాఖాతంలో కొన‌సాగుతున్న అల్ప‌పీడ‌నం, తెలుగు రాష్ట్రాల‌కు భారీ వ‌ర్ష‌సూచ‌న‌, ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం

Sandhya Theatre Tragedy: రేవతి కుటుంబానికి రూ. 2 కోట్ల ఆర్థిక సాయం అందజేసిన అల్లు అరవింద్, బాబు త్వరగా కోలుకుని మన అందరితో తిరుగుతాడని ఆశిస్తున్నామని వెల్లడి

Happy New Year 2025: కొత్త సంవత్సరం మీ ఫ్యామిలీతో కలిసి దేవాలయాలకు వెళ్లి దైవదర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారా. అయితే హైదరాబాద్ లో ఉన్న టాప్ 5 దేవాలయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.