Lakhimpur Kheri Violence: లఖింపూర్ ఖేరీ హింసాకాండ, మూడు రోజుల పోలీసు రిమాండ్‌కు ఆశిష్ మిశ్రా, మహా వికాస్ అఘాడీ తలపెట్టిన రాష్ట్రవ్యాప్త బంద్ విజయవంతం
కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా టెని కుమారుడు ఆశిష్ మిశ్రా షరతులతో మూడు రోజుల పోలీసు రిమాండ్‌కు (Sent to 3-Day Police Custody) పంపబడ్డారని ప్రాసిక్యూషన్ అడ్వకేట్ SP యాదవ్ తెలిపారు.
Lakhimpur Kheri, Oct 11: లఖింపూర్ ఖేరీ హింసాకాండ కేసులో (Lakhimpur Kheri Violence) అశిష్‌ను ఉత్తరప్రదేశ్ పోలీసులు శనివారం అరెస్టు చేసిన సంగతి విదితమే. కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా టెని కుమారుడు ఆశిష్ మిశ్రా షరతులతో మూడు రోజుల పోలీసు రిమాండ్‌కు (Sent to 3-Day Police Custody) పంపబడ్డారని ప్రాసిక్యూషన్ అడ్వకేట్ SP యాదవ్ తెలిపారు. లఖింపూర్ హింస కేసులో ఆశిష్ మిశ్రాను కస్టడీకి ఇవ్వాలని పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం కోర్టు విచారణ జరిపింది. హింస ఘటన అనంతరం శనివారం రాత్రి పోలీసులు స్థానిక కోర్టులో హాజరుపరచగా.. 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది.
లఖింపూర్ ఖేరీ హింసాత్మక ఘటనలో నలుగురు రైతులు సహా ఎనిమిది మృతి చెందారు. ఈ ఘటనకు సంబంధించి శనివారం విచారణకు హాజరవగా.. సుమారు 12 గంటల పాటు పోలీసులు విచారించారు. ఆ తర్వాత అరెస్టు చేశారు. క్రైమ్ బ్రాంచ్ కార్యాలయంలో ఆశిష్ మిశ్రాకు వైద్య పరీక్షలు చేయించి, మేజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు. న్యాయమూర్తి 14 రోజులు జ్యుడీషియల్ కస్టడీకి పంపినట్లు యాదవ్ పేర్కొన్నారు.
ఉత్తరప్రదేశ్‌లోని లఖిపూర్ ఖేరిలో ఈ నెల 3న జరిగిన హింసలో నలుగురు రైతులు సహా 9 మంది మృతికి నిరసనగా మహారాష్ట్రలోని మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం నేడు రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ బంద్‌కు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని శివసేన, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ), కాంగ్రెస్ పార్టీ ప్రజలకు పిలుపునిచ్చాయి. దీంతో ప్రజలు స్వచ్ఛందంగా బంద్ పాటించారు. ఫలితంగా రోడ్లన్నీ బోసిపోయి ఎడారులను తలపించాయి. వ్యాపారులు తమ సంస్థలను మూసివేశారు. బస్సులు ఎక్కడివక్కడ నిలిచిపోయాయి.
బంద్ అర్ధరాత్రి నుంచే ప్రారంభమైందని మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ తెలిపారు. నిరసనలో భాగంగా ముంబైలోని రాజ్‌భవన్ బయట మౌనదీక్ష చేపడతామని మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోల్ తెలిపారు. మహా వికాస్ అఘాడీ ప్రభుత్వ బంద్‌కు కిసాన్ సభ మద్దతు ప్రకటించింది. తమ కార్యకర్తలు రాష్ట్రంలో 21 జిల్లాల్లోనూ బంద్‌లో పాల్గొంటారని తెలిపింది. 2 వేలకు పైగా పండ్లు, కూరగాయలు, పూలు, ధాన్యాలు, ఉల్లిపాయలు తదితర వ్యాపారులు సంపూర్ణ మద్దతు ప్రకటించి దుకాణాలు మూసివేశారు. బంద్ ప్రభావం ముంబై, పూణె, ఔరంగాబాద్‌లలో తీవ్రంగా కనిపించింది. ఇందుకు సంబంధించిన ఫొటోలో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.