Jammu and Kashmir: భారత సైన్యంపై విరుచుకుపడిన ఉగ్రవాదులు, ఎదురుకాల్పుల్లో ఐదుగురు జవాన్లు మృతి, పూంచ్ సెక్టార్‌లో కొనసాగుతున్న సెర్చ్‌ ఆపరేషన్
Gunfight (Representational Image/ photo Credit: PTI)

Jammu, Oct 11:  జమ్మూకశ్మీర్‌లోని పూంచ్ సెక్టార్‌లో బుధవారం చోటు చేసుకున్న ఎన్‌కౌంటర్‌లో భారత ఆర్మీ సైనికులు ఐదుగురు మరణించారు. మృతిచెందిన వారిలో నలుగురు జవాన్లు (Army Officer, 4 Soldiers) Killed) , ఒక జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ (జేసీఓ) ఉన్నారు. ఉగ్రవాదుల ఉనికి గురించి నిఘా వర్గాలకు అందిన సమాచారం మేరకు.. సూరంకోట్‌లోని డీకేజీకి దగ్గరగా ఉన్న గ్రామంలో ఈ సర్చ్‌ ఆపరేషన్ ప్రారంభమైనట్లు రక్షణ ప్రతినిధి తెలిపారు. ముగ్గురు నుంచి నలుగురు ఉగ్రవాదులు అక్కడ దాక్కున్నట్లు అధికారులకు సమాచారం అందడంతో ఆర్మీ (Indian Army) ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టింది.

గాలింపు చర్యలు జరుపుతున్న ఆర్మీ అధికారులపైకి ముష్కరులు కాల్పులకు తెగబడ్డారు. ఉగ్రవాదుల చొరబాటు యత్నాలను తిప్పికొట్టే సమయంలో ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో సైన్యం అప్రమత్తమై ఎదురుకాల్పులు జరిగింది. ఈ ఘటనలో జేసీఓతో పాటు మరో నలుగురు జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయని ఆర్మీ అధికారి ఒకరు తెలిపారు. ఈ సందర్భంగా "తీవ్రంగా గాయపడిన జేఓవీ, నలుగురు జవాన్లను సమీప ఆస్పత్రికి తరలించాము. చికిత్స అందిస్తుండగా వారు మరణించారు. సెర్చ్‌ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది" అని ఆర్మీ తన అధికారిక ప్రకటనలో తెలిపింది. ఎన్‌కౌంటర్‌లో ఉగ్రవాదాలెవరైనా మరణించారా అనేది ఇంకా తెలియాల్సి ఉంది.