 
                                                                 Srinagar, NOV 03: సెంట్రల్ కశ్మీర్ శ్రీనగర్ జిల్లా (Srinagar Attack) ఆదివారం మార్కెట్‌లో గ్రెనేడ్ పేలుడు కలకలం సృష్టించింది. ఈ ఘటనలో 12 మంది వరకు గాయపడ్డారు. సీనియర్ పోలీసు అధికారి తెలిపిన వివరాల ప్రకారం.. టీఆర్‌సీ (TRC) సమీపంలో రద్దీగా ఉండే మార్కెట్‌లో ఉగ్రవాదులు గ్రెనేడ్ విసిరారు (Throw Grenade in Crowded). ఈ ఘటనలో 12 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉన్నది. అందరూ చిన్న గాయాలు మాత్రమే అయ్యాయని.. ఎవరికీ ప్రాణాపాయం లేదని పోలీసులు తెలిపారు.
Terrorists Throw Grenade in Crowded Market in Srinagar
Mysterious blast at TRC Lal Chowk #Srinagar, some people received injuries. More details emerging. pic.twitter.com/b7cNcHXkf1
— Irfan Quraishi (@irfanquraishi85) November 3, 2024
దాడి సంఘటన జరిగిన వెంటనే, ఉగ్రవాదులను పట్టుకునేందుకు భద్రతా దళాలు మొత్తం ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. దాడికి సంబంధించి మరింత సమాచారం సేకరించేందుకు దర్యాప్తు ప్రారంభించారు. అయితే, ప్రాథమిక సమాచారం ప్రకారం క్షతగాత్రుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. పోలీసులు వేగంగా స్పందించి భద్రతను కట్టుదిట్టం చేశారు.
 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                     
                     QuickLY
                                                                                QuickLY
                                     Socially
                                                                                Socially
                                     
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                     
                     
                     
                     
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                
