Lakhimpur Kheri Violence: అజయ్ మిశ్రాను వెంటనే మంత్రి పదవి నుంచి తప్పించాలి, అరెస్ట్ చేయాలి, ఈ డిమాండ్లతో రైల్‌ రోకోకు పిలుపునిచ్చిన సంయుక్త కిసాన్‌ మోర్చా, ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిరసనలు

సోమవారం దేశవ్యాప్తంగా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు రైల్‌ రోకో (Rail-Roko) నిర్వహిస్తామని ఆదివారం ప్రకటనలో తెలిపింది.

Rail-Roko' Agitation (Photo Credit: ANI)

New Delhi, October 18: లఖింపూర్‌ కేసులో అజయ్‌ మిశ్రాను కేంద్ర మంత్రి పదవి నుంచి తప్పించాలని ( Ajay Mishra Teni's Resignation), ఆయన్ని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్‌ చేస్తూ సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కేఎం) సోమవారం రైల్‌ రోకోకు పిలుపునిచ్చింది. సోమవారం దేశవ్యాప్తంగా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు రైల్‌ రోకో (Rail-Roko) నిర్వహిస్తామని ఆదివారం ప్రకటనలో తెలిపింది.

రైతులు శాంతియుతంగా నిరసనలు తెలుపాలని, రైల్వే ఆస్తులను ధ్వంసం చేయవద్దని కోరింది. ఈ నెల 3న లఖింపూర్‌లో కారు రైతులపైకి దూసుకెళ్లడం (Lakhimpur Kheri Violence), అనంతరం హింసలో 8 మంది చనిపోయిన సంగతి విదితమే. ఈ కేసులో అజయ్‌ మిశ్రా కుమారుడు ఆశిష్‌ మిశ్రాను పోలీసులు 9న అరెస్టు చేశారు. అజయ్‌ మిశ్రాను కూడా అరెస్టు చేయాలని ఎస్‌కేఎం డిమాండ్‌ చేస్తున్నది.

ఇక సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు నిరసన తెలుపుతున్న ఢిల్లీ-హర్యానా సరిహద్దుల్లోని సింఘులో ఘోరం జరిగింది. లఖ్‌బీర్‌ సింగ్‌(35) అనే దళిత కార్మికుడిని అత్యంత కిరాతకంగా హత్య చేశారు. పదునైన కత్తితో ఒక చేతి మణికట్టును నరికేశారు. శరీరంలో పదిచోట్ల గాట్లు పెట్టారు. తర్వాత ఆ మృత దేహాన్ని రైతులు నిరసన తెలుపుతున్న ప్రధాన వేదిక దగ్గర ఉన్న పోలీసు బ్యారికేడ్‌కు వేలాడదీశారు. శుక్రవారం జరిగిన ఈ ఘటన రైతుల్లో తీవ్ర కలవరం రేపింది.

రైతులపై కారు నడిపి చంపిన కేసు, పోలీసుల ఎదుట విచారణకు హాజరైన అశిష్‌ మిశ్రా, ఎటువంటి ఆధారాలు లేకుండా ఎవ‌ర్నీ అరెస్టు చేయ‌లేమ‌ని తెలిపిన యూపీ సీఎం యోగీ

హత్యపై సంయుక్త కిసాన్‌ మోర్చా(ఎస్‌కేఎం) స్పందించింది. ఇది నిహంగ్‌ల పనేనని ఆరోపించింది. వారు రైతు ఉద్యమాన్ని నీరుగార్చడానికి మొదటి నుంచీ ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నది. ఎస్‌కేఎం ఆరోపించినట్టుగానే.. హత్యకు పాల్పడింది తనేనంటూ సరవ్‌జిత్‌ సింగ్‌ అనే నిహంగ్‌ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. సిక్కు మత గ్రంథాన్ని లఖ్‌బీర్‌ సింగ్‌ అపవిత్రం చేశాడని అందుకే చంపేశానని చెప్పాడు. కాగా, లఖ్‌బీర్‌ హత్య నేపథ్యంలో నిరసన కేంద్రాల వద్ద నిఘా, భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని ఎస్‌కేఎం నిర్ణయించింది. మరోవైపు, ఈ ఘటనకు సంబంధించి శనివారం మరో ‘నిహంగ్‌’ను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

సింఘు బార్డ‌ర్ హ‌త్య కేసులో నిందితుడికి స్థానిక న్యాయ‌స్థానం ఏడు రోజుల పోలీస్ క‌స్ట‌డీ విధించింది. శుక్ర‌వారం సాయంత్రం నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు నిన్న కోర్టులో ప్ర‌వేశ‌పెట్టారు. దాంతో కోర్టు నిందితుడిని ఏడు రోజుల పోలీస్ క‌స్ట‌డీకి అప్ప‌గించింది. శుక్ర‌వారం తెల్ల‌వారుజామున సింఘు బార్డ‌ర్‌లో రైతులు ఆందోళ‌న చేస్తున్న స్థ‌లానికి స‌మీపంలో ఓ వ్య‌క్తి మృత‌దేహం క‌నిపించింది.

రెండు కాళ్లు, రెండు చేతులు న‌రికేసి మొండెం హోర్డింగ్‌పై వేలాడుతున్న స్థితిలో స్థానికులు చూసి భ‌యాందోళ‌న‌కు గుర‌య్యారు. అనంత‌రం పోలీసుల‌కు స‌మాచారం ఇవ్వ‌గా.. వారు ఘ‌ట‌నా ప్రాంతానికి చేరుకుని మృత‌దేహాన్ని పోస్టుమార్టానికి త‌ర‌లించారు.



సంబంధిత వార్తలు

Telangana Assembly Session 2024: అప్పులపై చర్చకు మేం సిద్ధం.. బీఆర్ఎస్ సిద్ధమా, సవాల్ విసిరిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సవాల్‌ను స్వీకరిస్తున్నామని తెలిపిన హరీష్ రావు, వీడియోలు ఇవిగో..

Telangana: తెలంగాణలో భూమిలేని వారికి రూ.6 వేలు, సంచలన నిర్ణయం తీసుకున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం, రాష్ట్ర కేబినెట్‌ కీలక నిర్ణయాలు ఇవిగో..

Tamil Nadu Shocker: అతుల్ సుభాష్ సూసైడ్ ఘటన మరువక ముందే మరో భార్యా భాధితుడు ఆత్మహత్య, కొడుకు మృతిని తట్టుకోలేక తల్లిదండ్రులు కూడా ఆత్మహత్య

Telangana: చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీలో పెట్టుబడులు పెట్టాలంటే ఇన్వెస్టర్లు భయపడుతున్నారు, మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు