Leh Bus Accident: ల‌ద్ద‌ఖ్ లో ఘోర ప్ర‌మాదం, 200 మీట‌ర్ల లోయ‌లో ప‌డిపోయిన బ‌స్సు, ఆరుగురు మృతి, ప‌లువురికి తీవ్ర గాయాలు

(Bus Falls Into Gorge) ఈ ప్రమాదంలో ఆరుగురు మరణించగా 22 మంది గాయపడ్డారు. కేంద్ర పాలిత ప్రాంతమైన లడఖ్‌లో ఈ సంఘటన జరిగింది. లేహ్‌ (Leh Accident) నుంచి తూర్పు లడఖ్‌కు వెళ్తున్న ప్రైవేట్‌ బస్సుపై డ్రైవర్‌ నియంత్రణ కోల్పోయాడు. దీంతో ఆ బస్సు అదుపు తప్పింది.

Leh BUS Accident

Leh, AUG 22: ప్రయాణికులతో వెళ్తున్న బస్సు లోయలో (Bus Falls) పడింది. (Bus Falls Into Gorge) ఈ ప్రమాదంలో ఆరుగురు మరణించగా 22 మంది గాయపడ్డారు. కేంద్ర పాలిత ప్రాంతమైన లడఖ్‌లో ఈ సంఘటన జరిగింది. లేహ్‌ (Leh Accident) నుంచి తూర్పు లడఖ్‌కు వెళ్తున్న ప్రైవేట్‌ బస్సుపై డ్రైవర్‌ నియంత్రణ కోల్పోయాడు. దీంతో ఆ బస్సు అదుపు తప్పింది. 200 మీటర్ల లోతైన లోయలోకి దూసుకెళ్లింది. కాగా, ఈ ప్రమాదం గురించి తెలిసిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు.

Here's Video

ఈ ప్రమాదంలో ఆరుగురు మరణించినట్లు పోలీసులు తెలిపారు. మరో 22 మంది గాయపడినట్లు చెప్పారు. క్షతగాత్రులను లేహ్‌లోని జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు పోలీస్‌ అధికారి తెలిపారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వెల్లడించారు.