Delhi Placed Under NSA: ఎన్ఎస్ఏ నీడలో ఢిల్లీ, ఆదేశాలు జారీ చేసిన ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనీల్ బైజాల్, వచ్చే నెలలో ఢిల్లీకి అసెంబ్లీ ఎన్నికలు, ఎన్ఎస్ఏ అంటే ఏమిటీ ?, విశ్లేషణాత్మక కథనం
ఢిల్లీ నేటి నుంచి మూడు నెలల పాటు (జనవరి 19 నుంచి ఏప్రిల్ 19 వరకు) ఎన్ఎస్ఏ (National Security Agency)నీడలో ఉంటుందని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనీల్ బైజాల్ ( Lt Governor Anil Baijal) ఆదేశాలు జారీ చేశారు. ఇప్పుడు ఢిల్లీలో ఈ ఆదేశాలు హాట్ టాఫిక్‌గా మారాయి. వచ్చే నెలలో ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఈ ఆదేశాలు ఇప్పుడు అక్కడ చర్చనీయాంశంగా మారాయి. ఇంతకీ ఈ ఆదేశాల ప్రకారం డిల్లీలో ఏం జరుగుతోందో ఓ సారి చూద్దాం.
New Delhi, January 19: దేశ రాజధాని ఢిల్లీ (Delhi)ఇప్పుడు ఎన్ఎస్ఏ (NSA)కిందకు చేరింది. ఢిల్లీ నేటి నుంచి మూడు నెలల పాటు (జనవరి 19 నుంచి ఏప్రిల్ 19 వరకు) ఎన్ఎస్ఏ (National Security Agency)నీడలో ఉంటుందని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనీల్ బైజాల్ ( Lt Governor Anil Baijal) ఆదేశాలు జారీ చేశారు. ఇప్పుడు ఢిల్లీలో ఈ ఆదేశాలు హాట్ టాఫిక్‌గా మారాయి. వచ్చే నెలలో ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఈ ఆదేశాలు ఇప్పుడు అక్కడ చర్చనీయాంశంగా మారాయి. ఇంతకీ ఈ ఆదేశాల ప్రకారం డిల్లీలో ఏం జరుగుతోందో ఓ సారి చూద్దాం.
ఈ ఆదేశాల ప్రకారం ఏ ఆందోళనకారుడు రోడ్డెక్కినా..పోలీసులు ఈ చట్టం ప్రకారం వారిని అరెస్టు చేసే అవకాశం ఉంది. జాతీయ భద్రతా చట్టం ప్రకారం అదుపులోకి తీసుకునే అధికారాన్ని పోలీసు కమిషనర్‌కు గవర్నర్ ఇచ్చారు. జాతీయ భద్రతకు, శాంతిభద్రతలకు ముప్పు అని అధికారులు భావిస్తే ఆ వ్యక్తిని నెలల తరబడి నిర్భందించే అవకాశం ఉంది.
ఢిల్లీలో కాషాయపు జెండా ఎగరేస్తాం:అమిత్ షా
ఈ చట్టం ప్రకారం 12 నెలల పాటు నిర్భందంలో ఉంచే అధికారం కూడా ఉందని సమాచారం. 24 గంటల్లో కోర్టులో హాజరు పరచడం, అరెస్టు అలాగే ఇతర ప్రాథమిక హక్కులను ఈ చట్టం(National Security Act (NSA)) తిరస్కరిస్తుందనే వాదనలు వినిపిస్తున్నాయి.
అచ్చే బీతే పాంచ్ సాల్..లగే రహో కేజ్రీవాల్, కొత్త నినాదంతో ఎన్నికలకు రెడీ అవుతున్న ఆప్
కాగా NSA కింద అరెస్టు చేస్తే కారణం చెప్పాల్సిన పనిలేదు. FIR లేకుండానే నిర్భందంలోకి తీసుకొనే ఛాన్స్ ఉంది. ఎంతమందిని అరెస్టు చేసి వారిని నిర్భందంలోకి తీసుకున్నారో అధికారికంగా లెక్కలు ఉండవు. పోలీసులను దూషించినా, వారిపై దాడులకు దిగినా, వారి విధులకు ఆటంకం కలిగించినా..అరెస్టు చేయవచ్చు.
కేజ్రీవాల్‌తో జత కట్టిన ప్రశాంత్ కిషోర్
ఇటీవలే జమ్మూ కాశ్మీర్‌లో ఆర్టికల్ 370(Article 370), ఆర్టికల్ 35ఏ ఎత్తివేత, కాశ్మీర్ విభజన సమయంలో ఈ జాతీయ భద్రతా చట్టాన్ని అమలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఢిల్లీ ఈ చట్టం కింద మూడు నెలల పాటు ఉండనుంది. కాగా వచ్చే నెలలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఈ చట్టాన్ని అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిపేందుకు NSA అమలు చేశారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.
ఇదిలా ఉంటే పౌరసత్వ సవరణ చట్టం (CAA), జాతీయ పౌర పట్టిక (NCR)లకు వ్యతిరేకంగా ఢిల్లీతో పాటు ఇతర రాష్ట్రాల్లో ఆందోళనలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. JNUలో విద్యార్థులు చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. గుర్తు తెలియని దండగులు క్యాంపస్‌లోకి చొరబడి అధ్యాపకులను, విద్యార్థులను తీవ్రంగా గాయపరిచారు. దీంతో పరిస్థితి మరింత వేడెక్కింది. ఈ సమయంలో ఈ చట్టం ముందుకు తీసుకరావడంతో సర్వత్రా అక్కడ ఈ విషయం చర్చనీయాంశంగా మారింది.