Lockdown 3.0: మద్యం షాపుల ముందు మందు బాబుల క్యూ, భౌతిక దూరం బేఖాతర్, మద్యం ధరలను 30 శాతం పెంచిన మమత సర్కారు, అదే బాటలో పలు రాష్ట్రాలు
లాక్‌డౌన్ (Lockdown) నిబంధనలు సడలించడంతో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో మద్యం దుకాణాలు (Liquor Shops Open in Several Cities Across India) తెరుచుకున్నాయి. దీంతో ఒక్కసారిగా మద్యం బాబులు షాపుల ముందు బారులు తీరారు. దాదాపు నెలన్నర తర్వాత మద్యం షాపులు తెరుచుకోవడంతో ఒక్కసారిగా పెద్దమొత్తంలో జనాలు గుమిగూడారు. ఇక మద్యం షాపుల (Liquor Shops) వద్ద భౌతిక దూరం పాటించాలని కేంద్ర ప్రభుత్వం నిబంధనలను పెట్టినా, చాలా చోట్ల అమలు అవ్వడంలేదు.
New Delhi, May 4: భారత్ మూడవ దశ లాక్డౌన్లోకి (India Lockdown 3.0) ప్రవేశించడంతో, ప్రభుత్వం అనేక సడలింపులను ఇచ్చింది. లాక్‌డౌన్ (Lockdown) నిబంధనలు సడలించడంతో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో మద్యం దుకాణాలు (Liquor Shops Open in Several Cities Across India) తెరుచుకున్నాయి. దీంతో ఒక్కసారిగా మద్యం బాబులు షాపుల ముందు బారులు తీరారు. ఢిల్లీలో వైన్ షాపు వద్ద లాఠీఛార్జ్, సామాజిక దూరాన్ని పాటించని ఢిల్లీ మద్యం ప్రియులు, వైన్ షాపు మూసివేసిన పోలీస్ అధికారులు
దాదాపు నెలన్నర తర్వాత మద్యం షాపులు తెరుచుకోవడంతో ఒక్కసారిగా పెద్దమొత్తంలో జనాలు గుమిగూడారు. ఇక మద్యం షాపుల (Liquor Shops) వద్ద భౌతిక దూరం పాటించాలని కేంద్ర ప్రభుత్వం నిబంధనలను పెట్టినా, చాలా చోట్ల అమలు అవ్వడంలేదు.
సోమవారం ఉదయం మద్యం షాపుల ముందు వేలాదిమంది తరలివచ్చారు. కేంద్రం ఇచ్చిన లాక్‌డౌన్ 3.0 నిబంధనలకు అనుగుణంగా కంటైన్ మెంట్ జోన్లలో తప్ప మిగతా అన్ని జోన్లలో కొన్ని రాష్ట్రాలు మద్యం అమ్మకాలకు అనుమతి ఇచ్చింది. ఉత్తర ఢిల్లీలోని బురారీలో ఓ వైన్ షాప్ ఎదుట వేలాది మంది మద్యం ప్రియులు బారులు తీరారు. దీంతో పోలీసులు లాఠీఛార్జ్ చేయాల్సి వచ్చింది.
ఇక కర్ణాటక రాజధాని బెంగళూరులోనూ మద్యం దుకాణాల ముందు మందుబాబులు బారులు తీరారు. ఈ రోజు నుంచి ఉదయం 9 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు మద్యం అమ్మకాలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడంత మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి.
ఛత్తీస్‌ఘఢ్ రాజ్‌నందగావ్‌లోని మద్యం దుకాణం వెలుపల వందలాది మంది సామాజిక దూర నిబంధనలను ఉల్లంఘిస్తూ కనిపించారు. రాష్ట్రంలో అన్ని జోన్లలో మద్యం దుకాణాలను ప్రారంభించడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. దీంతో అక్కడ మద్యం ప్రియులు బారులు తీరి కన్పించారు.
మహారాష్ట్రలో కూడా, ముంబైలోని ఆల్కహాల్ షాపుల వెలుపల పొడవైన క్యూలలో ప్రజలు నిలబడి ఉన్నారు, ఇక్కడ అత్యధికంగా COVID-19 కేసులు నమోదయ్యాయి.
దాదాపు 45 రోజుల తరువాత మద్యం దుకాణాలు తెరుచుకోవడంతో పలు రాష్ట్ర ప్రభుత్వాలు మద్యం రేట్లను విపరీతంగా పెంచుతున్నాయి. తాజాగా మద్యం ధరలపై పశ్చిమ్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కీలక నిర్ణయం తీసుకున్నారు. మద్యం ధరలను ఏకంగా 30శాతం పెంచుతూ మమత సర్కార్ నిర్ణయం తీసుకుంది. కొత్తగా పెరిగిన రేట్లు తక్షణమే అమల్లోకి వచ్చేలా జీవో జారీ చేసింది. షాపుల వద్ద రద్దీని తగ్గించేందుకు రేట్లు పెంచినట్లు ప్రభుత్వం తెలిపింది.
మద్యం ధరలపై బెంగాల్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్నే అమలు చేయాలని పలు రాష్ట్రాలు సైతం భావిస్తున్నాయి. కాగా ఆర్థిక వ్యవస్థను సంక్షోభం నుంచి గట్టెక్కించడం కోసం మద్యం దుకాణాలకు కేంద్రం షరతులతో కూడిన అనుమతినిచ్చిన విషయం తెలిసిందే. దీంతో దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో మద్యం షాపులు తెరుచుకున్నాయి.
ఇక మద్యం షాపులు తెరవడంతో ఛత్తీస్‌గడ్, బెంగళూరు, ఢిల్లీ ప్రాంతాల్లో కిలోమీటర్ల పొడవునా మద్యం ప్రియులు బారులు తీరారు. ఇక ఏపీలోనూ మద్యం ధరలు పెరిగాయి. మద్యం ధరలను 25% పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. అదనపు సర్‌ఛార్జి కింద ఈ ధరలను పెంచనున్నారు. మద్యపానాన్ని నిరుత్సాహపరిచి దుకాణాల వద్ద రద్దీ తగ్గించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.