Drone Crash In Karnataka: పంటపొలాల్లో కుప్పకూలిన భారీ డ్రోన్, భయాందోళనలో గ్రామస్తులు, కర్ణాటకలో డీఆర్‌డీవో కు చెందిన భారీ డ్రోన్ యాక్సిడెంట్

కర్ణాటక రాష్ట్రంలోని చిత్రదుర్గ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. డ్రోన్‌పై TAPAS-07A-14 నంబర్‌ ఉంది. ఒక్కసారిగా పంట పొలాల్లో డ్రోన్‌ కుప్పకూలడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు.

Drone Crash In Karnataka (PIC @ ANI X)

Karnataka, AUG 20: భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి విభాగానికి (డిఫెన్స్‌ రిసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌కు) సంబంధించిన డ్రోన్‌ (అన్‌ మ్యాన్డ్‌ ఏరియల్‌ వెహికిల్‌-UAV) ఒకటి ఆదివారం ఉదయం కుప్పకూలింది. కర్ణాటక రాష్ట్రంలోని చిత్రదుర్గ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. డ్రోన్‌పై TAPAS-07A-14 నంబర్‌ ఉంది. ఒక్కసారిగా పంట పొలాల్లో డ్రోన్‌ కుప్పకూలడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. వారు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు, డీఆర్‌డీవో (DRDO) అధికారులు ఘటనా ప్రాంతానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు.

 

పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా, ఈ ఘటనలో డ్రోన్‌ (Drone Crash) పూర్తిగా ధ్వంసమైంది. ఎలాంటి ప్రాణ నష్టం జరుగలేదు.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif