New Covid Strain in TN: వెంటాడుతున్న కొత్త కరోనా, లండన్ నుంచి వచ్చిన 433 మంది మిస్సింగ్, తమిళనాడులో జనవరి 31 వరకు లాక్‌డౌన్‌ పొడిగింపు, బీచ్‌ల్లో జనసంచారంపై పూర్తి స్థాయి నిషేధం

సంక్రాంతి తర్వాతి కానుమ్‌ పొంగల్‌ వేడుకల సందర్భంగా బీచ్‌ల్లో జనసంచారంపై నిషేధంతోపాటు మరికొన్ని నిబంధనలతో జనవరి నెలాఖరువరకూ కరోనా లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ (Lockdown extended in Tamil Nadu ) ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి గురువారం సాయంత్రం ప్రకటన విడుదల చేశారు.

COVID-19 lockdown (Photo Credit: PTI)

Chennai, Jan 1: కొత్త కరోనావైరస్ ప్రకంపనలు రేపుతున్న నేపథ్యంలో తమిళనాడు సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. సంక్రాంతి తర్వాతి కానుమ్‌ పొంగల్‌ వేడుకల సందర్భంగా బీచ్‌ల్లో జనసంచారంపై నిషేధంతోపాటు మరికొన్ని నిబంధనలతో జనవరి నెలాఖరువరకూ కరోనా లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ (Lockdown extended in Tamil Nadu ) ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి గురువారం సాయంత్రం ప్రకటన విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ ఆదేశాలను ఇస్తూనే ప్రభుత్వం కొన్ని సడలింపులను కూడా ఇచ్చింది.

ఇక జనవరి 16న జరిగే సంక్రాంతి వేడుకల సందర్భంగా అన్ని బీచ్‌లలోనూ జనం గుమిగూడకుండా నిషేధం విధించారు. రాష్ట్రంలో కరోనా వైరస్ పరిస్థితిపై ముఖ్యమంత్రి (Tamil Nadu Chief Minister Edappadi K Palaniswami) నేతృత్వంలో సమీక్ష జరిగిన ఆనంతరం లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. కరోనా ప్రభావం ఇప్పటికీ కొనసాగుతున్నందున మరో నెలరోజుల పాటు లాక్‌డౌన్ కొనసాగించనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. కాగా అన్ని బీచ్‌లోనూ గురు, శుక్రవారాల్లో న్యూ ఇయర్ వేడుకలను నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది.

కొత్త ఏడాదిలో కొత్త కరోనా కలవరం, ఫైజర్ వ్యాక్సిన్‌కు అత్యవసర అనుమతినిచ్చిన డబ్ల్యూహెచ్ఓ, దేశంలో తాజాగా 20,036 మందికి కరోనా, తెలంగాణలో 461 కొత్త కేసులు, ఏపీలో తాజాగా 338 మందికి కోవిడ్

కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధానికి కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు గత మార్చి 25 నుంచి రాష్ట్రంలో కఠిన నిబంధనలు, సడలింపులతో లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నామని ఆ ప్రకటనలో సీఎం తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా గత ఎనిమిది నెలల్లో ప్రభుత్వం తీసుకున్న కరోనా నిరోధక చర్యల కారణంగా పాజిటివ్‌ కేసుల సంఖ్య బాగా తగ్గుముఖం పట్టిందని, గత పది రోజులుగా కరోనా బాధితుల సంఖ్య 1100లోపే వున్నాయని, చికిత్స పొందుతున్నవారి సంఖ్య 50 వేల నుంచి 8867కు తగ్గిందని ఆయన పేర్కొన్నారు.

మార్చి నుంచి మే వరకు కొత్త కరోనావైరస్ స్ట్రెయిన్ విశ్వరూపం చూడవచ్చు, గతేడాది కరోనావైరస్ కూడా అప్పుడే సూపర్ స్ప్రెడర్ అయింది, దానికి A4 పేరు పెట్టామని తెలిపిన ఐజిఐబి డైరెక్టర్ అనురాగ్ అగర్వాల్

ఇదిలా ఉంటే బ్రిటన్‌లో పుట్టిన కొత్త కరోనావైరస్ (New Covid Starin in TN) కల్లోలం రేపుతున్న నేపథ్యంలో లండన్‌ నుంచి తమిళనాడుకు చేరుకున్న 433 మంది ప్రయాణికుల జాడ ఇంకా తెలియలేదు. ఈ ప్రయాణికుల కోసం గాలిస్తున్నట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్‌ కార్యదర్శి డాక్టర్‌ రాధాకృష్ణన్‌ తెలిపారు. వందరోజుల వరకు కరోనాతో పోరాడి గెలిచిన ఇద్దరు యోధులు గురువారం ఇంటిదారిపట్టారు.

చెన్నై రాజీవ్‌గాంధీ సూపర్‌స్పెషాలిటీ ప్రభుత్వ ఆసుపత్రి (జీహెచ్‌)లో కరోనా రోగులకు మెరుగైన చికిత్స అందుతుండగా 90 ఏళ్లకు పైబడినవారు సైతం కోలుకుంటున్నారు. ఇదే ఆస్పత్రిలో అత్యధికరోజులు కరోనా చికిత్స పొందిన ధనపాల్‌ (45), కార్తిక్‌ (37) గురువారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జయ్యారు. వందరోజులకు పైగా చికిత్స పొంది కరోనా నుంచి కోలుకున్న ఇద్దరు రోగులకు గురవారం ఆయన పుష్పగుచ్ఛం ఇచ్చి సాగనంపారు.

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశం మొత్తం మీద 20 మంది రూపుమార్చుకున్న కరోనా బారినపడగా తమిళనాడులో ఒక్కరు మాత్రమే ఉన్నారని అన్నారు. నవంబర్, డిసెంబర్‌లో బ్రిటన్‌ నుంచి 2,080 మంది తమిళనాడుకు చేరుకోగా వీరిలో 487 మంది ఆచూకీ తెలియలేదు. వీరంతా చెన్నై, చెంగల్పట్టు జిల్లాలకు చెందిన వారని తేలడంతో అవిశ్రాంతంగా గాలిస్తుండగా వీరిలో 54 మంది మరలా లండన్‌కు వెళ్లిపోయినట్లు తెలుసుకున్నామని చెప్పారు.

కొత్త కరోనావైరస్ స్ట్రెయిన్‌పై మార్గదర్శకాలు విడుదల, యూకే నుంచి వచ్చిన ప్రయాణికులు తప్పనిసరిగా RT-PCR పరీక్షలు చేయించుకోవాలని సూచించిన కేంద్ర ఆరోగ్య శాఖ

స్పెయిన్‌ నుంచి కోయంబత్తూరుకు వచ్చిన యువ కుని (27)కి కరోనా సోకినట్లు ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. ఈఎస్‌ఐ ఆస్పత్రిలోని ప్రత్యేకవార్డులో యువకుడిని ఉంచి కరోనా చికిత్స చేస్తున్నారు. కొత్త, పాత కరోనా నిర్ధారణకు యువకుడి నుంచి సేకరించిన నమూనాలను బెంగళూరుకు పంపారు. ఇదిలా ఉంటే సేలం లోక్‌సభ సభ్యుడు, డీఎంకే నేత ఎస్‌ఆర్‌ పార్థిబన్‌ కరోనా వైరస్‌కు గురయ్యారు. ఇటీవల జ్వరం సోకడంతో సేలంలోని ప్రయివేటు ఆస్పత్రిలో చేరి పరీక్షలు చేయించుకోగా గురువారం పాజిటివ్‌ నిర్ధారౖణెంది. దీంతో అదే ఆస్పత్రిలో కరోనా చికిత్స పొందుతున్నారు.

కొత్త కరోనావైరస్ స్ట్రెయిన్ ప్రమాదకరమా..? కరోనావైరస్ 2.0 అసలు పేరేంటి? కొత్త కోవిడ్ స్ట్రెయిన్ ఎప్పుడు..ఎక్కడ..ఎలా పుట్టింది? కోవిడ్ 2.0 గురించి పూర్తి సమాచారం

పుదుచ్చేరీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కిరణ్‌బేడీ వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేస్తున్న కోయంబత్తూరుకు చెందిన యువతికి పాజిటివ్‌ నిర్ధారౖణెంది. గవర్నర్‌ కిరణ్‌బేడీ రాజ్‌నివాస్‌ మొదటి అంతస్థులో నివసించడం వల్ల ఆ అంతస్థులోని ఉద్యోగులకు పరీక్షలు చేశారు. కిరణ్‌బేడీ ఇప్పటికే రెండుసార్లు పరీక్షలు చేయించుకున్నారు. వ్యక్తిగత కార్యదర్శి పాజిటివ్‌ బారినపడడంతో గురువారం మళ్లీ కిరణ్‌బేడి పరీక్షలు చేయించుకున్నారు.



సంబంధిత వార్తలు