Tamil Nadu Lockdown Extended: జూలై 19 వరకు లాక్‌డౌన్ పొడిగింపు, కీలక నిర్ణయం తీసుకున్న తమిళనాడు స్టాలిన్ సర్కారు, అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులపై నిషేధం కొనసాగింపు

కరోనావైరస్ కేసులు స్థిరంగా నమోదవుతున్న నేపథ్యంలో లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్టు (Tamil Nadu Lockdown Extended) తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. జులై 19 వరకు లాక్ డౌన్ పొడిగిస్తున్నట్టు తెలిపింది. అయితే ఇదే సమయంలో ప్రజలకు కొంత వెసులుబాటును కల్పిస్తున్నట్టు పేర్కొంది.షాపులు మరో గంట సేపు అదనంగా తెరుచుకుని ఉంటాయని, రాత్రి 9 గంటలకు మూతపడతాయని ప్రభుత్వం తెలిపింది.

Tamil Nadu Lockdown Extended: జూలై 19 వరకు లాక్‌డౌన్ పొడిగింపు, కీలక నిర్ణయం తీసుకున్న తమిళనాడు స్టాలిన్ సర్కారు, అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులపై నిషేధం కొనసాగింపు
Coronavirus Lockdown. Representative Image (Photo Credit: PTI)

Chennai, July 10: కరోనావైరస్ కేసులు స్థిరంగా నమోదవుతున్న నేపథ్యంలో లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్టు (Tamil Nadu Lockdown Extended) తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. జులై 19 వరకు లాక్ డౌన్ పొడిగిస్తున్నట్టు తెలిపింది. అయితే ఇదే సమయంలో ప్రజలకు కొంత వెసులుబాటును కల్పిస్తున్నట్టు పేర్కొంది.షాపులు మరో గంట సేపు అదనంగా తెరుచుకుని ఉంటాయని, రాత్రి 9 గంటలకు మూతపడతాయని ప్రభుత్వం తెలిపింది.

రెస్టారెంట్లు, టీ షాపులు, బేకరీలు, రోడ్ సైడ్ ఈటరీలు రాత్రి 9 వరకు ఓపెన్ గా ఉంటాయని చెప్పింది. అయితే 50 శాతం కెపాసిటీకి మించి కస్టమర్లు ఉండరాదని షరతు విధించింది. ఇదే సమయంలో (Lockdown in Tamil Nadu Extended) ఇవన్నీ కోవిడ్ ప్రొటోకాల్ ను పాటించాలని చెప్పింది. క్యూలలో సోషల్ డిస్టెన్స్ ఉండాలని తెలిపింది.

పెళ్లిళ్లకు 50 మందికి మించి హాజరు కాకూడదని, అంత్యక్రియలకు 20 మంది మాత్రమే హాజరు కావాలని షరతు విధించింది. స్కూళ్లు, కాలేజీలు, థియేటర్లు, స్విమ్మింగ్ పూళ్లు, జంతు ప్రదర్శనశాలలు మూసి ఉంటాయని చెప్పింది. అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులపై నిషేధాన్ని కొనసాగించింది. అయితే పాండిచ్చేరికి మాత్రం బస్పు సర్వీసులను ప్రారంభించింది. కోవిడ్ ప్రొటోకాల్ ను పాటిస్తూ స్టేట్, సెంట్రల్ జాబ్స్ టెస్టులను నిర్వహిస్తామని తెలిపింది.

కార్యకర్త చెంప చెళ్లుమనిపించిన డీకే శివకుమార్, సామాజిక దూరం పాటించక పోవడం వల్లే తనకు కోపం వచ్చిందని వివరణ

పుదుచ్చేరితో రవాణా కార్యకలాపాలు ముఖ్యంగా బస్సు సర్వీసులు పునః ప్రారంభిస్తున్నట్లు వెల్లడించింది. ఇక, పాఠశాలలు, కాలేజీలు, థియేటర్లు, మద్యం దుకాణాలు, స్విమ్మింగ్‌ ఫూల్స్‌, జూలు తదుపరి ఆదేశాల వరకు మూసే ఉంటాయని స్టాలిన్‌ సర్కారు స్పష్టం చేసింది. కాగా తమిళనాడులో శుక్రవారం కొత్తగా 3039 కొత్త కరోనా కేసులు వెలుగు చూడగా, 69 మంది కోవిడ్‌ బాధితులు మరణించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం 25 లక్షల 13 వేల కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)



సంబంధిత వార్తలు

Brutual Murder at Bhupalapally: మేడిగడ్డ కుంగుబాటు.. కేసీఆర్‌పై కేసు వేసిన వ్యక్తి దారుణ హత్య, భూపాలపల్లిలో లింగమూర్తిని దారుణంగా చంపేసిన దుండగులు, కేటీఆర్ ఆదేశాలతోనే హత్య జరిగిందని మృతుడి భార్య ఆవేదన

Delhi CM Rekha Gupta Oath: ఢిల్లీ సీఎం రేఖా గుప్తా ప్రమాణస్వీకారం.. సిద్ధమైన రాంలీలా మైదానం, రేఖా గుప్తాతో పాటు ఆరుగురు మంత్రుల ప్రమాణస్వీకారం, వివరాలివే

Peddapalli Shocker: పక్కింటి యువకుడితో 65 ఏళ్ల మహిళ సహజీవనం..తట్టుకోలేక వృద్ధ మహిళ మొదటి ప్రియుడు ఆమెను కర్రతో బాది స్మశానంలోకి లాక్కెళ్లి ఏం చేశాడంటే..?

‘Earthquake Incoming'? సముద్రం అడుగు నుంచి బయటకు వచ్చిన డూమ్స్‌డే ఫిష్, భూకంపం వస్తుందేమోననే భయంతో వణుకుతున్న మెక్సికన్లు, రాబోయే ఉపద్రవానికి సూచనగా ఒడ్డుకు వచ్చిన ఓర్ఫిష్ ..

Share Us