కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ మరోసారి సహనం కోల్పోయారు. తన భుజం మీద చేయి వేసేందుకు ప్రయత్నించిన ఓ కార్యకర్తపై చేయి చేసుకున్నారు.. సీనియర్ రాజకీయ నేత, మాజీ మంత్రి జి.మడెగౌడ ఆరోగ్య పరిస్థితిని వాకబు చేసేందుకు శివకుమార్ మాండ్య వెళ్లినప్పుడు ఈ ఘటన చోటుచేసుకుంది.

డీకేకు అతి సమీపంలో కార్యకర్త నడుస్తున్నట్టు, డీకే భుజం మీద అతను చేయ వేయబోయే ప్రయత్నం చేసినట్టు వీడియోలో కనిపిస్తోంది. ఇది డీకేకు ఆగ్రహం తెప్పించడంతో చెంప చెళ్లుమనిపించారు. ప్రజల ముందు సక్రమంగా మసలుకోవాలని మందలించారు. అయితే, మీడియా కూడా తమ వెంటే ఉందని గ్రహించిన డీకే వెంటనే వారిని వీడియో తొలగించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. సామాజిక దూరం పాటించక పోవడం వల్లే తనకు కోపం వచ్చినట్టు వివరణ ఇచ్చారు.

2018 ఎన్నికల సమయంలోనూ బళ్లారిలో ప్రచారం చేస్తుండగా తనతో సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించిన ఒక వ్యక్తి చేతిపై డీకే కొట్టారు. సెల్ఫీ తీయడం సరి కాదని, సహజ ధోరణిలోనే తాను స్పందించానని అప్పట్లో ఆయన చెప్పారు. తన బాధ్యతలను తాను సక్రమంగా నిర్వర్తిస్తూ ప్రెస్‌ను ఉద్దేశించి మాట్లాడుతున్నప్పుడు సెల్ఫీ అంటూ ఎవరైనా ఎందుకు రావాలి?'' అని ప్రశ్నించారు.

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)