Lockdown Extension Suspense: లాక్‌డౌన్‌ కొనసాగించాలా, వద్దా అనేదానిపై మే 3 తర్వాత తుది నిర్ణయం, రాష్ట్రాల సీఎంలతో ముగిసిన ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్‌

ఈ సమావేశంలో లాక్‌డౌన్‌పై (Lockdown) సుదీర్ఘంగా చర్చజరిగింది. దీనిలో భాగంగా ప్రధాని మోదీకి సీఎంలు పలు సూచనలు, సలహాలు చేశారు. అలాగే ఆయా రాష్ట్రాల్లో ఉన్న ప్రస్తుత పరిస్థితుల గురించి వివరించారు. వైరస్‌ వ్యాప్తి ఎక్కువ, తక్కువగా ప్రాంతాలను జోన్ల వారీగా విడదీసి ముందుకెళ్లాలని మోదీకి సూచించారు.

PM Modi in video conference with State CMs | (Photo Credits: Twitter/@CMOMaharashtra)

New Delhi, April 27: రాష్ట్రాల ముఖ్యమంత్రులతో లాక్‌డౌన్‌పై ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌ (PM Narendra Modi Video Conference) ముగిసింది. ఈ సమావేశంలో లాక్‌డౌన్‌పై (Lockdown) సుదీర్ఘంగా చర్చజరిగింది. దీనిలో భాగంగా ప్రధాని మోదీకి సీఎంలు పలు సూచనలు, సలహాలు చేశారు. అలాగే ఆయా రాష్ట్రాల్లో ఉన్న ప్రస్తుత పరిస్థితుల గురించి వివరించారు. వైరస్‌ వ్యాప్తి ఎక్కువ, తక్కువగా ప్రాంతాలను జోన్ల వారీగా విడదీసి ముందుకెళ్లాలని మోదీకి సూచించారు.  లాక్‌డౌన్ కొనసాగింపుకే ప్రధాని మొగ్గు చూపారా?, రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్, తుది నిర్ణయం ఎప్పుడంటే...?

ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ... మనం కలిసి చేస్తున్న ప్రయత్నాలు ప్రభావ చూపిస్తున్నాయి. కరోనాపై లాక్‌డౌన్‌ (Nationwide Lockdown) ప్రభావం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. లాక్‌డౌన్‌ వల్ల మంచి ఫలితాలు కూడా వస్తున్నాయి. వేలమంది ప్రాణాలు రక్షించడంలో ఈ ప్రయత్నాలు చాలా ముఖ్యం. దీనిపై నిరంతరం నిపుణుల సూచనలు తీసుకుంటున్నాం. ఉపాధిహామీ పనులు, కొన్ని పరిశ్రమల పనులు ప్రారంభమయ్యాయ్యాయని తెలిపారు. లాక్‌డౌన్‌ కారణంగా వేల మంది ప్రాణాలను కాపాడుకోగలిగాం. తక్షణ స్పందన మన లక్ష్యం కావాలి. దో గజ్ దూరీ (2 గజాల దూరం) మంత్రం కావాలి. ప్రజలు మరికొన్ని రోజులు లాక్‌డౌన్‌కు సహకరించాలి, ప్రధాని మోదీతో ముఖ్యమంత్రుల సమావేశం తర్వాత మరింత స్పష్టత వస్తుంది: తెలంగాణ సీఎం కేసీఆర్

కరోనాతో పోరు కొనసాగిస్తూనే ఆర్థిక వ్యవస్థకు ప్రాధాన్యతనివ్వాలి. రానున్న కొన్ని నెలల పాటు కరోనా ప్రభావం కనిపిస్తుంది. అందుకే మాస్కులు, ఫేస్ కవర్లు జీవితంలో భాగం కావాలి. దేశం ఇప్పటికే 2 లాక్‌డౌన్లు చూసింది. ఇక ముందు ఏం చేయాలన్న విషయంపై దృష్టి పెట్టాలి. సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకుంటూ సంస్కరణలు తీసుకురావాలి. హాట్‌స్పాట్ - రెడ్ జోన్లలో ఆంక్షలు కఠినంగా అమలు చేయాలి. రెడ్ జోన్లను ఆరెంజ్, గ్రీన్ జోన్లుగా మార్చేందుకు కృషి చేయాలి’ అని అన్నారు.

See Meghalaya CM's Tweet

ఇక లాక్‌డౌన్‌పై మే 3వ తేదీ తరువాత నిర్ణయం (Lockdown Extension Suspense) తీసుకుంటామని ప్రధాని అన్నట్లుగా తెలుస్తోంది. కరోనా వ్యాప్తి ఉన్నచోట్ల లాక్‌డౌన్‌ కొనసాగుతుందని, కరోనా ప్రభావం తక్కువున్న రాష్ట్రాల్లో, జిల్లాల వారిగా సమీక్షిస్తామని ఆయన వెల్లడించినట్లు సమాచారం. కాగా గ్రీన్‌జోన్లలో పూర్తి సడలింపు ఇచ్చి.. రెడ్‌జోన్లలో లాక్‌డౌన్‌ కొనసాగించాలని కొందరు ముఖ్యమంత్రులు ప్రధాని దృష్టికి తీసుకువచ్చారు. ఆర్థిక వ్యవస్థ కుంటుపడకుండా చర్యలు తీసుకోవాలని మోదీకి విజ్ఞప్తి చేశారు. అలాగే లాక్‌డౌక్‌ కారణంగా ఆదాయ మార్గాలు పూర్తిగా మూతపడటంతో.. రాష్ట్రాలకు ఆర్థిక ఉద్దీపన నిధులివ్వాలని ప్రధాని మోదీని కోరారు.

లాక్‌డౌన్ ఎత్తేసేందుకు ప్లాన్ రూపొందించాలని, అందుకోసం రెడ్, గ్రీన్, ఆరెంజ్‌ జోన్ల విభజన చేసుకోవాలని మోదీ ముఖ్యమంత్రులకు సూచించినట్లు సమాచారం. అయితే నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు లాక్‌డౌన్ పొడగింపు వైపే మొగ్గు చూపినట్లు సమాచారం. ప్రధాని మోదీకి ఇదే విషయాన్ని కరాఖండిగా చెప్పినట్లు తెలుస్తోంది. దీనిపై మేఘాలయ ముఖ్యమంత్రి కోర్నాడ్ సంగ్మా మాట్లాడుతూ... మే 3 తర్వాత కూడా తమ రాష్ట్రంలో లాక్‌డౌన్ పొడగింపుకే మొగ్గు చూపుతున్నామని మోదీకి తెలిపినట్లు ట్విట్టర్ ద్వారా తెలిపారు. అయితే గ్రీన్‌ జోన్లు, కోవిడ్ - 19తో ప్రభావితం కాని జిల్లాల్లో మాత్రం లాక్‌డౌన్ ఎత్తేస్తామని సంగ్మా అన్నారు.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif