CJI SA Bobde: బెయిలా..జైలా అంటూ జోకేసిన సీజేఐ బోబ్డే, ధర్మేంద్ర వాల్వే బెయిల్ పిటిషన్ విచారణ సంధర్భంగా సుప్రీంకోర్టులో నవ్వులు పండించిన చీఫ్ జస్టిస్ శరద్ అరవింద్ బోబ్డే
కృష్ణ జన్మాష్టమి 2020 (Janmashtami 2020) సందర్భంగా హత్య నేరస్థుడి బెయిల్ పిటిషన్ను విచారణ చేస్తూ.. కృష్ణుడు జైలులో ఈ రోజే పుట్టాడు కదా (Lord Krishna Was Born in Jail) అప్పుడే నీకు బెయిల్ కావాలా అంటూ కాసేపు అందరినీ నవ్వించారు. వివరాల్లోకెళితే.. మహారాష్ట్రకు చెందిన ధర్మేంద్ర వాల్వే ఓ మర్డర్ కేసులో జైలుశిక్షను అనుభవిస్తున్నాడు. అయితే అతను పెట్టుకున్న బెయిల్ పిటిషన్ అభ్యర్థనను సీజే విచారించారు. ధర్మేంద్రకు బెయిల్ ఇవ్వాలంటూ పిటిషనర్ తరపున న్యాయవాది కోరారు.
New Delhi, August 12: చీఫ్ జస్టిస్ శరద్ అరవింద్ బోబ్డే (Sharad Arvind Bobde) ఓ కేసు తీర్పు సందర్భంగా సుప్రీంకోర్టులో జోక్ వేసి అందర్నీ నవ్వించారు. కృష్ణ జన్మాష్టమి 2020 (Janmashtami 2020) సందర్భంగా హత్య నేరస్థుడి బెయిల్ పిటిషన్ను విచారణ చేస్తూ.. కృష్ణుడు జైలులో ఈ రోజే పుట్టాడు కదా (Lord Krishna Was Born in Jail) అప్పుడే నీకు బెయిల్ కావాలా అంటూ కాసేపు అందరినీ నవ్వించారు. వివరాల్లోకెళితే.. మహారాష్ట్రకు చెందిన ధర్మేంద్ర వాల్వే ఓ మర్డర్ కేసులో జైలుశిక్షను అనుభవిస్తున్నాడు. అయితే అతను పెట్టుకున్న బెయిల్ పిటిషన్ అభ్యర్థనను సీజే విచారించారు. ధర్మేంద్రకు బెయిల్ ఇవ్వాలంటూ పిటిషనర్ తరపున న్యాయవాది కోరారు.
ఆ సమయంలో చీఫ్ జస్టిస్ మాట్లాడుతూ.. నీకు బెయిల్ కావాలా జైలు కావాలా.. శ్రీకృష్ణ భగవానుడు (Lord Krishna) ఇవాళే జైలులో పుట్టారని, నీకు జైలు విడిచి వెళ్లాలని ఉందా అంటూ చమత్కరించారు. అపుడు పిటిషనర్ తరపున న్యాయవాది తమకు బెయిల్ కావాలంటూ అభ్యర్థించారు. గుడ్.. నీకు మతపరమైన పట్టింపులు లేవనట్లుగా సీజీ వ్యాఖ్యానించారు. గుడిని కాపాడేందుకు ముస్లీంలు మానవహారం, బెంగుళూరు అల్లర్లలో వెల్లివిరిసిన మతసామరస్యం, సోషల్ మీడియలో వైరల్ అవుతున్న వీడియో ఇదే
కాంగ్రెస్ పార్టీ సభ్యుడైన ధర్మేంద్ర వాల్వేతో (Dharmendra Valvi) పాటు అయిదు మంది పార్టీ కార్యకర్తలపై మర్డర్ కేసు నమోదు అయ్యింది. 1994లో బీజేపీ అభ్యర్థిని హతమార్చిన కేసులో వాళ్లు జైలు శిక్ష అనుభవిస్తున్నారు. ట్రయల్ కోర్టు వారిని ఆ కేసులో దోషులుగా తేల్చింది. హైకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. ఆ కేసును విచారించిన సీజే.. 25వేల పూచీకత్తుపై ధర్మేంద్రకు బెయిల్ మంజూరీ చేశారు. కాగా కృష్ణుడు మధురలోని జైలు లోపల దేవకి.. వాసుదేవునికి జన్మించాడు.