Madhya Pradesh Horror: వీళ్లు మనుషులేనా, మూడు నెలల చిన్నారి పొట్టపై బాగా కాల్చిన కడ్డీతో 51 సార్లు వాతలు, చికిత్స పొందుతూ చిన్నారి మృతి

న్యూమోనియాకు చికిత్స పేరుతో మూడు నెలల పసికందును దారుణంగా హింసించి చంపేశారు.

Representational Image | (Photo Credits: IANS)

మధ్యప్రదేశ్‌లో ఒళ్లు గగుర్పొడిచే ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. న్యూమోనియాకు చికిత్స పేరుతో మూడు నెలల పసికందును దారుణంగా హింసించి చంపేశారు. షాహ్‌దోల్‌ జిల్లా పరిధిలోని ఓ గిరిజన తండాలో చిన్నారికి.. నాటు వైద్యం పేరుతో తండా పెద్దలు 51 సార్లు కాల్చిన కడ్డీతో కడుపు మీద వాతలు పెట్టారు . అయితే అది వికటించి.. బిడ్డ ప్రాణం మీదకు వచ్చింది. దీంతో స్థానికంగా ఓ ఆస్పత్రికి తరలించగా.. 15 రోజులు చికిత్స పొందుతూ ఆ చిన్నారి కన్నుమూసింది.

ఏడాది చిన్నారిపై మంత్రగాడు దారుణం, కుద్ర పూజలు పేరిట పళ్లు విరగొట్టి, నేలకేసి కొట్టిన భూత వైద్యుడు, చోద్యం చూస్తూ నిలబడ్డ తండ్రి

చిన్నారి కన్నుమూసిన తర్వాత గుట్టుచప్పుడు కాకుండా మృతదేహాన్ని బంధువులు ఖననం చేశారు. అయితే విషయం పోలీసుల దాకా వెళ్లడంతో.. చిన్నారి మృతదేహాన్ని బయటకు వెలికి తీసి పోస్ట్‌మార్టం నిర్వహించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశారు.ఇదిలా ఉంటే మధ్యప్రదేశ్‌ గిరిజన ప్రాంతాల్లో ఇలా జబ్బులకు కడ్డీలను కాల్చి వాతలు పెట్టడం కొందరు ఆచారంగా భావిస్తారు.

అయితే ఈ విధానం జబ్బును నయం చేయకపోగా, గాయాలకు కారణం అవుతోందని.. ఒక్కోసారి ఉన్న సమస్యలే ఆరోగ్యాన్ని క్షీణింపజేసి మరణాలకు సైతం దారి తీస్తోందని స్థానిక వైద్య సిబ్బంది చెబుతున్నారు