Madhya Pradesh: కూరలో ఒక టమాటా ఎక్కువ వేశాడని భర్తను వదిలేసిన భార్య, లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించిన భర్త, పూర్తి వివరాలు ఇవిగో..

తనకు చెప్పకుండా భర్త కూరలో రెండు టమాటాలు వాడాడని, అలిగి భార్య పుట్టింటికి వెళ్లిపోయింది.తమ కుమార్తెతో సహా ఇంటిని విడిచిపెట్టి వెళ్లడంతో..ఈ ఘటనపై భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు వారు ఈ భార్యాభర్తల మధ్య సయోధ్య కుదిర్చారు.

Representational Picture. Credits: Wikimedia Commons

మధ్యప్రదేశ్‌లోని షాహ్డోల్‌లో చిత్రమైన ఘటన చోటు చేసుకుంది. తనకు చెప్పకుండా భర్త కూరలో రెండు టమాటాలు వాడాడని, అలిగి భార్య పుట్టింటికి వెళ్లిపోయింది.తమ కుమార్తెతో సహా ఇంటిని విడిచిపెట్టి వెళ్లడంతో..ఈ ఘటనపై భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు వారు ఈ భార్యాభర్తల మధ్య సయోధ్య కుదిర్చారు.

ఘటన వివరాల్లోకి వెళితే.. టిఫిన్‌ సెంటర్‌ నడుపుతున్న సంజీవ్‌ వర్మన్‌ వంటలు చేస్తున్న సందర్భంలో కూరలో టమాటాలు వినియోగించాడు. దీనిని గమనించిన అతని భార్య.. భర్తపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఇంటి నుంచి వెళ్లిపోతానని బెదిరించింది. అయితే భర్త ఇకపై ఇలాంటి తప్పు చేయనని, భవిష్యత్‌లో ఎప్పుడూ టమాటా జోలికి వెళ్లనని హామీ ఇచ్చినప్పటికీ ఆమె భర్త మాటను పట్టించుకోకుండా ఇంటిని విడిచిపెట్టి ఎక్కడికో వెళ్లిపోయింది.

అయ్యో పాపం, టమాటా రేట్లు పెరగడంతో 20 రోజుల్లో 30 లక్షలు సంపాదించిన రైతు, డబ్బు కోసం రైతుని హత్య చేసిన దుండగులు

దీంతో ఆందోళన చెందిన భర్త తన భార్యను గాలించేందుకు పోలీసులను ఆశ్రయించాడు. భార్య అదృశ్యమయ్యిందంటూ ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు సంజీవ్‌ నుంచి అతని భార్య ఆరతి ఫోన్‌ నంబరు తీసుకుని ట్రేస్‌ చేశారు. ఆమె ఉమరియాలోని తన సోదరి ఇంటివద్ద ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. పోలీసులు ఆమెతో మాట్లాడారు. ఆ దంపతుల మధ్య సయోధ్య కుదిర్చారు.

ధనపురి పోలీస్‌స్టేషన్‌ అధికారి సంజయ్‌ జైశ్వాల్‌ ఈ ఉదంతం గురించి మాట్లాడుతూ ఆరతి వర్మ తమతో ఫోనులో మాట్లాడినప్పుడు తన భర్త తాగివచ్చి తనను, కుమార్తెను కొడుతుంటాడని ఫిర్యాదు చేసిందన్నారు. సందీప్‌, ఆరతిలకు 8 ఏళ్లక్రితం వివాహమయ్యిందని, వారికి 4 ఏళ్ల కుమార్తె ఉన్నదని తెలిపారు.



సంబంధిత వార్తలు