Madhya Pradesh: గుడి ముందు దండం పెట్టుకుని అనంతరం ఇంటిపై బాంబులు విసిరిన అగంతకుడు, వీడియో సోషల్ మీడియాలో వైరల్

ఈ ఘటన ఆ ప్రాంతంలో అమర్చిన సీసీటీవీ కెమెరాలో రికార్డైంది.మంగళవారం జబల్‌పూర్‌లోని ఘమాపూర్ ప్రాంతంలోని భారత్ కృషి సమాజ్ స్కూల్ సమీపంలో ఈ సంఘటన జరిగింది,

Madhya Pradesh Man Prays At Temple, Then Throws Bombs At House Watch Video Video

మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో ఒక వ్యక్తి తనకు 'సెక్యూరిటీ మనీ' చెల్లించడానికి నిరాకరించిన నివాసితులను బెదిరించేందుకు ఒక ఇంటిపై బాంబులు విసిరాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటన ఆ ప్రాంతంలో అమర్చిన సీసీటీవీ కెమెరాలో రికార్డైంది.మంగళవారం జబల్‌పూర్‌లోని ఘమాపూర్ ప్రాంతంలోని భారత్ కృషి సమాజ్ స్కూల్ సమీపంలో ఈ సంఘటన జరిగింది, ఆనంద్ ఠాకూర్ అనే వ్యక్తి ఇంటిపై బాంబులు విసిరి భయాందోళనలకు గురిచేసే ప్రయత్నం చేశాడు. దారుణం, భర్తను కట్టేసి ప్రైవైట్ భాగాలను కోసిన భార్య, మత్తు మందు ఇచ్చి ఛాతీపై కూర్చొని గొంతు కోసి చంపడానికి ప్రయత్నం, సీసీటీవీ ఫుటేజ్ చూసి ఖంగుతిన్న పోలీసులు

ఈ ఘటనను సంగ్రహించిన సీసీటీవీ ఫుటేజీలో నిందితుడు రెండు చేతుల్లో బాంబులు తీసుకుని నడుచుకుంటూ వెళ్తుండగా, నివాసానికి చేరుకోగానే ఒకదాని తర్వాత ఒకటి బాంబులు విసురుతున్నట్లు తెలుస్తోంది. ఒక బాంబు పేల్చడంలో విఫలమవ్వగా, మరొకటి పేలడంతో పొగ మేఘాలు ఇంటి లోపల నుంచి చుట్టుపక్కల వరకు వ్యాపించాయి.

Here's Video

బాంబు దాడికి ముందు, ఠాకూర్ సమీపంలోని ఆలయంలో పూజలు నిర్వహించడం కొసమెరుపు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఠాకూర్ నివాసితులనే కాకుండా వ్యాపారవేత్తలను కూడా బెదిరించి, రక్షణ డబ్బు వసూలు చేయడంలో పేరుగాంచాడు. నివాసితులు ఘమాపూర్ పోలీస్ స్టేషన్‌లో అధికారికంగా ఫిర్యాదు చేయగా, ఠాకూర్‌ను కనుగొనడానికి శోధన ఆపరేషన్ జరుగుతోంది.