Madhya Pradesh Shocker: మధ్యప్రదేశ్ లో దారుణం, కూల్ డ్రింక్‌లో విషం కలిపి మూడవ భర్తను చంపేందుకు భార్య ప్లాన్, ట్విస్ట్ ఏంటంటే..

ఓ భార్య తన భర్తకు కూల్ డ్రింక్ లో విషం కలిపి భర్తను హత్య చేసేందుకు భార్య ప్రయత్నించింది. ఈ సందర్భంలో ఆ ప్రయత్నం విఫలం కాగా.. భార్య బండారం భర్తకు తెలియడంతో.. . అతను భార్యపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Representational Image | (Photo Credits: IANS)

Bhopal, Nov 22: మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ జిల్లాలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది.  ఓ భార్య తన భర్తకు కూల్ డ్రింక్ లో విషం కలిపి భర్తను హత్య చేసేందుకు భార్య ప్రయత్నించింది.  ఈ సందర్భంలో ఆ ప్రయత్నం విఫలం కాగా.. భార్య బండారం భర్తకు తెలియడంతో.. . అతను భార్యపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఘటన వివరాల్లోకెళితే.. కోమల్ ,మోహిత్ శర్మ  ఈ సంవత్సరం జూన్ లో పెళ్లి చేసుకున్నారు. అయితే కోమల్ కు ఇది మూడో పెళ్లి. వీళ్లిద్దరి పెళ్లి జరిగి ఐదు నెలలు మాత్రమే అయింది. ఇంతలో కోమల్ కు ఏమైందో తెలియదు కానీ...  భర్తను చంపేయాలని  పథకం రచించింది. ప్లాన్ లో భాగంగా  నవంబర్ 15 న కూల్ డ్రింక్ లో విషం కలిపి భర్త మోహిత్ శర్మ కు ఇచ్చింది. అతను ఆ డ్రింక్ తాగిన వెంటనే తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు.

నెలన్నర బాలుడిపై నర్సు దారుణం, చికిత్స పేరుతో 40 సార్లు వేడి ఇనుప రాడ్‌తో వాతలు

వెంటనే ఆసుపత్రిలో చేరిన మోహిత్ శర్మకు తనపై విష ప్రయోగం జరిగిందని తెలుసుకున్నాడు. ఈ క్రమంలో అతను కోలుకొని డిశ్చార్జైన తర్వాత మోహిత్ నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లాడు. నాకు విషమిచ్చి చంపేందుకు ప్రయత్నించింది నా భార్యనే అని.. అతడు ఆమెపై కేసు పెట్టాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.. భర్త మోహిత్ శర్మను కోమల్ ఎందుకు హత్య చేయాలనుకున్నదానిపై ఆరా తీస్తున్నారు. గతంలో ఆమె ఇద్దరి భర్తల నుంచి ఎందుకు విడిపోయిందన్న విషయంపై కూడా దర్యాప్తు చేపట్టారు.