Madhya Pradesh Shocker: కిరానా సామాన్లు కొనేందుకు బైక్‌పై వెళ్తుండగా యువకుడికి గుండెపోటు, కుప్పకూలి రోడ్డు మీదనే మృతి చెందిన బైకర్

మృతికి గల కారణాలను తెలుసుకునేందుకు పోలీసులు శవపరీక్ష నిర్వహించారు.

Heart Attack. (Photo Credits: Pixabay)

ఇండోర్,ఫి బ్రవరి 19: కిరాణా సామాన్లు కొనేందుకు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా 25 ఏళ్ల యువకుడు గుండెపోటుతో మృతి చెందిన సంఘటన ఆజాద్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం జరిగింది. మృతికి గల కారణాలను తెలుసుకునేందుకు పోలీసులు శవపరీక్ష నిర్వహించారు. బాధితుడికి సైలెంట్ హార్ట్ ఎటాక్ వచ్చిందని పోలీసులు భావిస్తున్నారు. తమ్ముడితో కలిసి ఉండగా ఒక్కసారిగా ఛాతి నొప్పి రావడంతో కదులుతున్న ద్విచక్ర వాహనంపై నుంచి కిందపడ్డాడు.

స్కూలు బస్సు నడుపుతుండగా గుండెపోటుతో డ్రైవర్ మృతి, 40 మంది విద్యార్థులను కాపాడి మృత్యు ఒడిలోకి..

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతుడు న్యూ ఇందిరా నగర్‌కు చెందిన రాహుల్‌ రైక్వార్‌గా గుర్తించారు. అతను ఎలక్ట్రీషియన్. అతనికి మూడేళ్ల క్రితం వివాహం కాగా ఏడాదిన్నర కుమార్తె ఉంది. ఘటనకు ఒకరోజు ముందు తన కూతురికి వేడుకను ఏర్పాటు చేశాడు. కేసు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు మృతుడికి పోస్టుమార్టం నిర్వహించారు.



సంబంధిత వార్తలు

00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif