Tamil Nadu Lockdown 3.0: తమిళనాడులో ఆన్‌లైన్ ద్వారా మద్యం విక్రయాలు, మద్యం షాపులను మూసివేయాలని ఆదేశించిన మద్రాస్ హైకోర్టు, అక్కడ 6 వేలు దాటిన కరోనా కేసులు
మద్యాన్ని కేవలం ఆన్‌లైన్ ద్వారానే విక్రయించాలని స్పష్టం చేసింది. కాగా మే 17 వరకే అంటే లాక్ డౌన్ ముగిసేవరకు (Tamil Nadu Lockdown 3.0) ఆన్‌లైన్‌లో లిక్కర్ విక్రయాలను అనుమతిస్తారు. రాష్ట్రంలో మద్యం దుకాణాల వద్ద భౌతిక దూరం పాటించాలనే నిబంధనలను ఉల్లంఘిస్తున్నారనే ఫిర్యాదులు వెల్లువెత్తడంతో హైకోర్టు తాజా ఉత్తర్వులు జారీ చేసింది.
Chennai, May 9: తమిళనాడులో ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించే అన్ని మద్యం షాపులను (liquor shops in TN) మూసివేయాలని మద్రాస్ హైకోర్టు (Madras High Court) శుక్రవారం ఆదేశించింది. మద్యాన్ని కేవలం ఆన్‌లైన్ ద్వారానే విక్రయించాలని స్పష్టం చేసింది. కాగా మే 17 వరకే అంటే లాక్ డౌన్ ముగిసేవరకు (Tamil Nadu Lockdown 3.0) ఆన్‌లైన్‌లో లిక్కర్ విక్రయాలను అనుమతిస్తారు. రాష్ట్రంలో మద్యం దుకాణాల వద్ద భౌతిక దూరం పాటించాలనే నిబంధనలను ఉల్లంఘిస్తున్నారనే ఫిర్యాదులు వెల్లువెత్తడంతో హైకోర్టు తాజా ఉత్తర్వులు జారీ చేసింది. మద్యం డోర్ డెలివరీ, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయం పరిశీలించాలని కోరిన అత్యున్నత న్యాయస్థానం, మద్యం అమ్మకాల నిలిపివేతపై ఉత్తర్వులు జారీ చేయలేమన్న సుప్రీంకోర్టు
ఇదిలా ఉంటే తమిళనాడులో (Tamil Nadu) తొలిరోజు మద్యం విక్రయాలు రికార్డు స్దాయిలో రూ.170 కోట్ల మేర సాగాయి. కోవిడ్-19 కేసులు విపరీతంగా పెరుగుతున్న క్రమంలో మద్యం విక్రయాలకు అనుమతి ఇవ్వడం అక్కడ వివాదాస్పదమైంది.
తమిళనాడులో కొద్ది రోజులుగా వరుసగా వందల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. గురువారం 580 మందికి కరోనా పాజిటివ్ రాగా.. శుక్రవారం ఒక్క రోజే 600 కొత్త కేసులు వచ్చాయి. ఇవాళ నమోదైన కేసుల్లో 399 ఒక్క చెన్నైలోనివే. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,009కి చేరింది. అలాగే శుక్రవారం ఒక్క రోజే కొత్తగా ముగ్గురు మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 40కి చేరింది. రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై తమిళనాడు ఆరోగ్య శాఖ మంత్రి విజయభాస్కర్ శుక్రవారం సాయంత్రం మీడియాకు వివరాలను వెల్లడించారు.
రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం 6009 కరోనా కేసులు నమోదయ్యాయని చెప్పారు. అందులో 40 మంది మరణించగా.. 1605 మంది డిశ్చార్జ్ అయ్యారని తెలిపారు. ప్రస్తుతం 4361 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని మంత్రి చెప్పారు. కాగా, ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల్లో చెన్నైలోనే 3,043 ఉన్నాయి. అందులో చెన్నై కోయంబేడు మార్కెట్‌లోనే 1,589 కేసులు వచ్చాయి.