Cops Test Corona Positive: పోలీస్ శాఖలో కరోనా కల్లోలం, ముంబై పోలీసుల్లో 100 మందికి పైగా కోవిడ్-19 పాజిటివ్, దేశ వ్యాప్తంగా 35 వేలు దాటిన కరోనావైరస్ కేసులు

ఇప్ప‌టికే 100కి పైగా పోలీసులు కోవిడ్-19 వైర‌స్ భారిన ప‌డ్డారు. తాజాగా వ‌డాలా పోలీసు స్టేష‌న్ (Wadala police statio) ప‌రిధిలోని 9 మంది కానిస్టేబుల్స్‌కు కోవిడ్ (Cops Test Corona Positive) సోకిందని అధికార వర్గాలు వెల్లడించాయి. గురువారం నిర్వ‌హించిన ప‌రీక్ష‌లో క‌రోనా పాజిటివ్ (Coronavirus) అని తేలడంతో వీరంతా ముంబైలోని గురునాన‌క్ హాస్పిట‌ల్‌లో చికిత్స పొందుతున్నారు.వీరితో పాటు కుటుంస‌భ్యుల‌ను కూడా క్వారంటైన్‌లో ఉంచామ‌ని అధికారులు తెలిపారు.

Cops Test Corona Positive (Photo-PTI)

Mumbai, May 2: ముంబై పోలీసు శాఖ‌లో (Mumbai Police) క‌రోనావైర‌స్ క‌ల‌క‌లం రేపుతోంది. ఇప్ప‌టికే 100కి పైగా పోలీసులు కోవిడ్-19 వైర‌స్ భారిన ప‌డ్డారు. తాజాగా వ‌డాలా పోలీసు స్టేష‌న్ (Wadala police statio) ప‌రిధిలోని 9 మంది కానిస్టేబుల్స్‌కు కోవిడ్ (Cops Test Corona Positive) సోకిందని అధికార వర్గాలు వెల్లడించాయి. గురువారం నిర్వ‌హించిన ప‌రీక్ష‌లో క‌రోనా పాజిటివ్ (Coronavirus) అని తేలడంతో వీరంతా ముంబైలోని గురునాన‌క్ హాస్పిట‌ల్‌లో చికిత్స పొందుతున్నారు.వీరితో పాటు కుటుంస‌భ్యుల‌ను కూడా క్వారంటైన్‌లో ఉంచామ‌ని అధికారులు తెలిపారు. మే 17 వరకు లాక్‌డౌన్ పొడిగింపు, పట్టాలెక్కనున్న 400 శ్రామిక స్పెషల్ రైళ్లు, కేంద్ర రైల్వే శాఖ జారీ చేసిన మార్గదర్శకాలు ఇవే

వడాలా పోలిస్ స్టేష‌న్ ప‌రిధిలో మెత్తం 7రెడ్ జోన్లు ఉన్నాయ‌ని, వీటిలోనే 9 మంది పోలీస్ కానిస్టేబుల్స్ విధులు నిర్వ‌హించ‌డంతో క‌రోనా సోకింద‌ని అనుమానిస్తున్న‌ట్లు డిప్యూటీ కమిషనర్ రష్మి కరాండికర్ తెలిపారు. ముంబైలోని ధారావిలో క‌రోనా కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. గురువారం ఒక్క‌రోజే 25 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో ధారావిలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 369కి పెరిగింది. ఏపీలో కొత్తగా 60 కేసులు, తెలంగాణలో తాజాగా 6 కేసులు, మూడవ దశ లాక్‌డౌన్ మే 17 వరకు పొడిగించిన కేంద్రం

ధారావిలో కోవిడ్ కార‌ణంగా ఇప్పటివరకు 18 మంది ప్రాణాలు కోల్పోయారు. గ‌త రెండు రోజుల్లోనే ధారావి పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలోని ఏడుగురు పోలీసుల‌కి క‌రోనా సోకింది. ఇప్ప‌టివ‌ర‌కు న‌గ‌రంలో ముగ్గురు పోలీసులు వైర‌స్ ధాటికి మృత్యువాత ప‌డ్డారు. ఈ నేప‌థ్యంలో 55 ఏళ్లు పైబ‌డిన పోలీసులు ఇళ్లలోనే ఉండాల‌ని నగర పోలీసు చీఫ్ పరంబిర్ సింగ్ ఆదేశించారు. మద్యం షాపులు తెరుచుకోవచ్చు, గ్రీన్ జోన్లలో మద్యం అమ్మకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన హోం శాఖ, మే 4 నుంచి 17వ తేదీ వరకు లాక్‌డౌన్‌ పొడిగింపు

దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 1993 తాజా కేసులు వెలుగు చూశాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 35,043కు ఎగబాకగా ఇప్పటివరకూ 8889 మంది డిశ్చార్జి అయ్యారు. మహమ్మారి బారినపడి మరణించిన వారి సంఖ్య 1147కు పెరిగిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ శుక్రవారం మీడియా సమావేశంలో వెల్లడించారు.వ్యాధి నుంచి కోలుకుని నిన్న 554 మంది డిశ్చార్జి అయ్యారని, రికవరీ రేటు 25.37 శాతానికి పెరిగిందని ప్రకటించడం ఊరట కలిగించే అంశం.