New Delhi, May 1: దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ను మరో రెండు వారాల పాటు అంటే మే 17 వరకు (Lockdown 3.0) పొడిగించిన విషయం విదితమే. అయితే గ్రీన్ జోన్లలో మద్యం, పాన్ దుకాణాలను (Liquor Stores And Paan Shops) అనుమతి ఇస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మద్యం, పాన్ షాపుల వద్ద 6 అడుగులు భౌతికదూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. పట్టాలెక్కనున్న 400 శ్రామిక స్పెషల్ రైళ్లు, మే 17 వరకు లాక్‌డౌన్ పొడిగింపు, కేంద్ర రైల్వే శాఖ జారీ చేసిన మార్గదర్శకాలు ఇవే
దుకాణాల వద్ద ఒకేసారి ఐదుగురి కంటే ఎక్కువ మంది ఉండకూడదని హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. లాక్‌డౌన్ రెండో దఫా ఈ నెల 3తో ముగియనుంది. ఈ నేపథ్యంలో మే 4 నుంచి 17వ తేదీ వరకు లాక్‌డౌన్ (Coronavirus lockdown) మరోసారి పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.
ఇదిలా ఉంటే శనివారం ఉదయం 10 గంటలకు జాతిని ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) ప్రసంగించనున్నారు. కరోనా కట్టడి కొనసాగింపు చర్యలపై మోదీ స్పష్టత ఇవ్వనున్నారు. కాగా రెడ్, గ్రీన్, ఆరెంజ్ జోన్లలో హోంశాఖ కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది కేంద్రం. మద్యం షాపులు తెరవాల్సిందే..! ముఖ్యమంత్రికి కాంగ్రెస్ ఎమ్మెల్యే డిమాండ్, అల్కాహాల్ సేవించడం వల్ల గొంతు నుండి కరోనావైరస్ తొలగిపోతుందని వాదన
Here's the MHA order:
Liquor stores & paan shops will be allowed to function in green zones while ensuring minimum six feet distance (2 gaz ki doori) from each other & ensuring that not more 5 persons are present at one time at the shop: MHA on the extension of #lockdown for two weeks from May 4
— ANI (@ANI) May 1, 2020
సైకిళ్లు, రిక్షాలు, ఆటో రిక్షాలు, ట్యాక్సీలు, క్యాబ్‌లు, బస్సులు, కటింగ్ షాపులపై అన్ని జోన్లలో నిషేధం విధించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే గ్రీన్, ఆరెంజ్ జోన్లలో కొన్ని ఆంక్షలు సడలింపు ఇచ్చారు. దేశంలో తొలి రైలు కదిలింది, వలస కార్మికులతో లింగంపల్లి రైల్వే స్టేషన్ నుంచి జార్ఖండ్‌కు బయలు దేరిన ప్రత్యేక రైలు
ఈ జోన్లలో రాత్రి 7 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉండనుంది. వారానికి ఒకసారి రెడ్ జోన్లలో పరిస్థితిని పరిశీలించనున్నారు. ఈ సమయంలో కేసులు తగ్గితే రెడ్ జోన్లను గ్రీన్ జోన్లగా మార్చనున్నారు. గ్రీన్, ఆరెంజ్ జోన్లలో సాధారణ కార్యకలాపాలకు అనుమతి ఇచ్చారు. గ్రీన్ జోన్లలో ఉదయం 7 నుంచి రాత్రి 7 గంటల వరకు వ్యాపారాలకు అనుమతి ఇస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆరెంజ్ జోన్లలో వ్యక్తిగత వాహనాలకు అనుమతి ఇచ్చారు. కార్లలో ఇద్దరికి, టూ వీలర్‌పై ఒక్కరికి మాత్రమే అనుమతి ఇచ్చారు.