Maharashtra Lockdown Extension: జూలై 31 వ‌ర‌కు లాక్‌డౌన్‌ పొడిగింపు, కీలక నిర్ణయం తీసుకున్న మహారాష్ట్ర సర్కారు, ముంబైని వణికిస్తున్న కరోనావైరస్

‌మ‌హారాష్ట్ర‌లో క‌రోనా కేసులు రోజురోజుకు వేగంగా పెరిగిపోతున్న‌ాయి. అక్క‌డ క‌రోనాని క‌ట్ట‌డి చేయ‌డం కోసం గ‌త నాలుగు నెల‌లుగా ఎన్ని చ‌ర్య‌లు తీసుకున్నా కేసుల సంఖ్య పెరుగుతున్న‌దే త‌ప్ప త‌గ్గ‌డంలేదు. ఈ నేప‌థ్యంలో మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం (Maharashtra Govt) కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను (Maharashtra Lockdown) జూలై 31 వ‌ర‌కు పొడిగించ‌నున్న‌ట్లు వెల్ల‌డించింది. ఈ మేర‌కు మ‌హా స‌ర్కారు సోమ‌వారం ఒక ప్ర‌క‌ట‌న‌ విడుద‌ల చేసింది.

File Image of Uddhav Thackeray | File Photo

Mumbai, June 29: ‌మ‌హారాష్ట్ర‌లో క‌రోనా కేసులు రోజురోజుకు వేగంగా పెరిగిపోతున్న‌ాయి. అక్క‌డ క‌రోనాని క‌ట్ట‌డి చేయ‌డం కోసం గ‌త నాలుగు నెల‌లుగా ఎన్ని చ‌ర్య‌లు తీసుకున్నా కేసుల సంఖ్య పెరుగుతున్న‌దే త‌ప్ప త‌గ్గ‌డంలేదు. ఈ నేప‌థ్యంలో మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం (Maharashtra Govt) కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను (Maharashtra Lockdown) జూలై 31 వ‌ర‌కు పొడిగించ‌నున్న‌ట్లు వెల్ల‌డించింది. ఈ మేర‌కు మ‌హా స‌ర్కారు సోమ‌వారం ఒక ప్ర‌క‌ట‌న‌ విడుద‌ల చేసింది. 24 గంటల్లో 19 వేల కేసులు నమోదు, దేశంలో 5.5 లక్షలకు చేరువలో కరోనా కేసులు, ఒకే రోజు 380 మంది కరోనాతో మరణం

అయితే, లాక్‌డౌన్ (Lockdown) నియమ నిబంధ‌న‌లు ఎలా ఉండాల‌నే విష‌యంలో స్థానిక ప‌రిస్థితుల‌ను బ‌ట్టి జిల్లాల క‌లెక్ట‌ర్లు, మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్లు నిర్ణ‌యం తీసుకుంటార‌ని మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం త‌న ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్న‌ది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అత్య‌వ‌స‌రాలు, నిత్య‌వ‌సరాల‌కు సంబంధించిన అన్ని ర‌కాల వ్యాపార‌ కార్య‌క‌లాపాలు య‌థావిధిగా కొన‌సాగుతాయ‌ని తెలిపింది. అత్య‌వ‌స‌రంకానీ వాటిలో వేటిని అనుమ‌తించాలి, వేటిని అనుమతించ‌కూడ‌దు అనే విష‌యంలో స్థానిక అధికార యంత్రంగమే నిర్ణ‌యాలు తీసుకుంటుంద‌ని స్ప‌ష్టం చేసింది.

Maharashtra Government extends lockdown in the state till 31 

మహారాష్ట్రలో  1,59 వేల కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు కరోనా నుండి 84,245 మంది కోలుకొన్నారు. ఇప్పటివరకు కరోనాతో రాష్ట్రంలో 7273 మంది మరణించినట్టుగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాలు చెబుతున్నాయి.

ఇదిలా ఉంటే మార్కె ట్లు, సెలూన్లు, బార్బర్ షాపులు, ఇతర అవసరాల కోసం తమ ఇళ్ల నుంచి 2 కిలోమీటర్ల పరిధి దాటి వెళ్లొద్దని ముంబై వాసులను పోలీసులు ఆదేశించారు. ఈ పరిధి దాటి షాపింగ్ చేసేం దుకు వెళ్లడాన్ని బ్యాన్ చేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే ఔట్ డోర్ ఎక్సర్ సైజ్ లకు కూడా అనుమతి లేదన్నారు.

ఆఫీసులు, మెడికల్ ఎమర్జెన్సీ కోసం వెళ్లే వాళ్లకు మాత్రం 2 కిలోమీటర్ల పరిధి దాటి వెళ్లేందుకు అనుమతి ఉంటుందని చెప్పారు. ఈ విషయంలో ఉద్యోగులు, అత్యవసర సేవల సిబ్బందిని మినహాయించారు. చాలామంది కోవిడ్ నిబంధనలు ఉల్లంఘిస్తూ తమతో పాటు ఇతరుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టేస్తున్నట్టు గుర్తించిన అధికారులు.. ఇకపై ప్రజలెవరూ రెండు కిలోమీటర్ల పరిధిని దాటి వెళ్లడానికి వీల్లేదని పేర్కొన్నారు. వారేం చేసినా ఆ పరిధిలోనేనని స్పష్టం చేశారు.

కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్న నేపథ్యం లో మరింత జాగ్రత్తగా ఉండాలని కోరారు. ఫిజికల్ డిస్టెన్సింగ్ పాటించాలని సూచించింది. సరైన కారణం లేకుండా తిరిగే వెహికల్స్ ను స్వాధీనం చేసుకుంటామని ముంబై పోలీస్ శాఖ హెచ్చిరించింది. వ్యాయామం, వాకింగ్ వంటి వాటిని కూడా రెండు కిలోమీటర్ల పరిధిలోనే చేసుకోవాల్సి ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరు మాస్క్ తప్పని సరిగా ధరించాలని, భౌతిక దూరం పాటించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

SC On BRS MLAs' Case: రోగి చనిపోతే ఆపరేషన్ విజయవంతమా, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు విచారణలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు, తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ

Mamunoor Airport: మామునూరు ఎయిర్ పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్..ఉత్తర్వులు జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హర్షం

‘Are They Hindus’: మహా కుంభమేళాకు వెళ్లని రాహుల్‌ గాంధీ, ఉద్ధవ్ ఠాక్రే హిందుత్వవాదులేనా? వారిని వెంటనే బహిష్కరించాలంటూ మండిపడిన బీజేపీ పార్టీ

Hindi Language Row in Tamil Nadu: వీడియో ఇదిగో, తమిళనాడులో బోర్డుల మీద హిందీ అక్షరాలను చెరిపేస్తున్న డీఎంకే కార్యకర్తలు, కొత్త విద్యా విధానాన్ని అమలు చేయబోమని స్పష్టం

Advertisement
Advertisement
Share Now
Advertisement