Maharashtra Shakti Bill: ఏపీ దిశ చట్టం తరహాలో..మహారాష్ట్రలో శక్తి బిల్లును తీసుకువచ్చిన ఉద్ధవ్ సర్కారు, మహారాష్ట్ర శక్తి బిల్లు 2020 ద్వారా పోక్సో చట్టం మరింత కఠినతరం
హైదరాబాద్ దిశ ఘటన తర్వాత ఏపీలో మహిళల రక్షణ కోసం దిశ బిల్లును తీసుకువచ్చిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో మహిళలు, చిన్నారుల పట్ల హింసను అదుపు చేసే ఉద్దేశంతో మహారాష్ట్ర ప్రభుత్వం ఇవాళ అసెంబ్లీలో (Maharashtra Assembly) శక్తి బిల్లును ప్రవేశపెట్టింది. ఏపీలోని దిశ చట్టం తరహాలో శక్తి బిల్లును (Maharashtra Shakti Bill) రూపొందించారు.
Mumbai, Dec 14: దేశంలో అత్యాచారాలు పెరిగిపోతున్న నేపథ్యంలో అన్నిరాష్ట్రాల ప్రభుత్వాలు దీనిని కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. హైదరాబాద్ దిశ ఘటన తర్వాత ఏపీలో మహిళల రక్షణ కోసం దిశ చట్టం తీసుకువచ్చిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో మహిళలు, చిన్నారుల పట్ల హింసను అదుపు చేసే ఉద్దేశంతో మహారాష్ట్ర ప్రభుత్వం ఇవాళ అసెంబ్లీలో (Maharashtra Assembly) శక్తి బిల్లును ప్రవేశపెట్టింది. ఏపీలోని దిశ చట్టం తరహాలో శక్తి బిల్లును (Maharashtra Shakti Bill) రూపొందించారు.
హైదరాబాద్‌లో జరిగిన దిశ అత్యాచార ఘటన తర్వాత దేశవ్యాప్తంగా ఆందోళన నెలకొన్న విషయం తెలిసిందే. ఆ తర్వాత మహిళల రక్షణ కోసం ఆంధ్రప్రదేశ్ ఆ వెంటనే దిశ చట్టాన్ని రూపొందించింది. ఐపీసీలో కొన్ని మార్పులు చేస్తూ .. మహిళల పట్ల నేరాలకు పాల్పడినవారికి కఠిన శిక్ష అమలు చేసే విధంగా చర్యలు తీసుకున్నారు. అయితే దిశ చట్టం తరహాలో రూపొందించిన శక్తి బిల్లు పట్ల మహారాష్ట్రలో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి.
శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో శక్తి బిల్లును (Shakti Bill) ప్రవేశపెట్టనున్నట్లు ఇటీవల సీఎం ఉద్దవ్ ఠాక్రే తెలిపారు. మహిళలపై దారుణమైన నేరాలకు పాల్పడినవారికి కఠినమైన శిక్షలు విధించే ఆంధ్రప్రదేశ్ దిశా చట్టానికి సమానమైన బిల్లును త్వరలో ప్రవేశపెడతామని మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ ముఖ్ (Maharashtra Home Minister Anil Deshmukh) గతంలో చెప్పారు. ప్రతిపాదిత చట్టం ప్రకారం అత్యాచార కేసుల విచారణ మొత్తం 21 రోజుల్లో పూర్తవుతుందని, మరణశిక్షతో సహా కఠినమైన శిక్షకు అవకాశం ఉంటుందని మంత్రి చెప్పారు.దిశా చట్టం 2019, మహిళలపై చేసిన నేరాలకు కఠినమైన శిక్షను అనుమతిస్తుంది మరియు అత్యాచారానికి మరణశిక్షను అనుమతిస్తుంది మరియు అలాంటి కేసులలో తీర్పు వ్యవధిని 21 పని దినాలకు తగ్గిస్తుంది.
2019లో ఆంధ్ర తయారు చేసిన దిశ చట్టంలో.. రేప్ నిందితులకు మరణశిక్షను విధించారు. అయితే ఆ తరహాలోనే శక్తి బిల్లును రూపొందించినట్లు ఇటీవల మహా సీఎం తెలిపారు. మహిళా హక్కుల న్యాయవాదులు, కార్యకర్తలు, ప్రొఫెసర్లు, న్యాయకోవిదులు.. ఆ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టవద్దు అని మహా సీఎంను కోరారు. బిల్లు దారుణంగా ఉందని, బిల్లు రూపకల్పనకు ముందు తమను సంప్రదించాల్సి ఉంటే బాగుండేదని న్యాయవాది వీణా గౌడ తెలిపారు. శక్తి బిల్లు ప్రకారం.. రేప్ బాధితులకు మరణశిక్ష లేదా పది నుంచి 20 ఏళ్ల వరకు జీవిత ఖైదు శిక్షను అమలు చేయనున్నారు.
మహారాష్ట్ర శక్తి బిల్లు 2020 ద్వారా ఐపీసీలో ఉన్న కొన్ని క్రిమినల్ నియామావళిని మార్చాలని భావిస్తున్నారు. పోక్సో చట్టాన్ని కూడా మరింత కఠినతరం చేయనున్నారు. మహిళల పట్ల నేరాలు జరుగుతున్న రాష్ట్రాల్లో.. మహారాష్ట్ర మూడవ స్థానంలో ఉన్నది.