Five Level Unlock Plan: మహారాష్ట్రలో ఐదు స్థాయిల్లో అన్‌లాక్ ప్రక్రియ‌, ప్రతి గురువారం క‌రోనా ప‌రిస్థితుల‌ను ప్రజారోగ్య శాఖ స‌మీక్ష, అన్‌లాక్ మొద‌టి స్థాయిలో కనీస పరిమితులు, ఐద‌వ స్థాయిలో అధిక‌ పరిమితులు

రాష్ట్రంలో క‌రోనావైరస్ కేసులు తగ్గు ముఖం పట్టిన నేపథ్యంలో ప్ర‌భుత్వం కొన్ని ఆంక్షల నుంచి మిన‌హాయింపులు ఇచ్చేందుకు స‌మాయ‌త్త‌మ‌వుతోంది. మొత్తం ఐదు స్థాయిల్లో క్రమంగా లాక్‌డౌన్‌ను (Five Level Unlock Plan) సడలించనున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం (CMO Maharashtra) ప్రకటించింది.

Coronavirus in Mumbai (Photo Credits: PTI)

Mumbai, June 5: మహారాష్ట్ర ప్రజలకు ఎట్టకేలకు సోమవారం నుంచి ఉపశమనం లభించనుంది. రాష్ట్రంలో క‌రోనావైరస్ కేసులు తగ్గు ముఖం పట్టిన నేపథ్యంలో ప్ర‌భుత్వం కొన్ని ఆంక్షల నుంచి మిన‌హాయింపులు ఇచ్చేందుకు స‌మాయ‌త్త‌మ‌వుతోంది. మొత్తం ఐదు స్థాయిల్లో క్రమంగా లాక్‌డౌన్‌ను (Five Level Unlock Plan) సడలించనున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం (CMO Maharashtra) ప్రకటించింది. కోవిడ్‌ పాజిటివిటీ రేటు, రాష్ట్రంలో ఆక్సిజన్ పడకల లభ్యత ఆధారంగా మహారాష్ట్రలో సోమవారం నుంచి ఐదంచెల అన్‌లాక్ ప్రక్రియ‌ను (5-Level Unlock Plan) అమ‌లు చేయ‌నున్న‌ట్లు ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది.

రాష్ట్రంలోని జిల్లాల్లో కోవిడ్ -19 ప‌రిస్థితుల‌కు అనుగుణంగా మినహాయింపు పరిమితుల‌ను నిర్ణయించారు. పాజిటివిటీ రేటు, ఆక్సిజన్ పడకల అందుబాటును దృష్టిలో ఉంచుకుని అన్‌లాక్‌ నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది. ఈ మార్గదర్శకాల ప్రకారం ప్రతి గురువారం క‌రోనా ప‌రిస్థితుల‌ను ప్రజారోగ్య శాఖ స‌మీక్షించ‌నుంది. మహారాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం, అన్‌లాక్ మొద‌టి స్థాయిలో కనీస పరిమితులు ఉండగా, ఐద‌వ స్థాయిలో అధిక‌ పరిమితులు ఉండ‌నున్నాయి. లేదా లాక్‌డౌన్ కొన‌సాగుతుంది. మహారాష్ట్రలో గడ‌చిన‌ 24 గంటల్లో కొత్త‌గా 14 వేలకుపైగా క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి.

ఢిల్లీలో జూన్‌ 14 వరకు సడలింపులతో లాక్‌డౌన్‌, అన్‌లాక్‌ ప్రక్రియను మొదలు పెట్టిన ఢిల్లీ ప్రభుత్వం, మార్కెట్లు, మాల్స్‌ను సరి-బేసి పద్ధతిలో తెరవాలని సూచించిన ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌

లెవెల్‌-1: పాజిటివిటీ రేటు ఐదు శాతం లేదా అంతకంటే తక్కువ ఉండి, ఆసుపత్రుల్లో పడకలు 25 శాతం కంటే తక్కువ నిండి ఉన్న జిల్లాలు లెవెల్‌ 1 కిందకు వస్తాయి. ఈ జిల్లాల్లో లాక్‌డౌన్‌ను పూర్తిగా ఎత్తివేస్తారు. ప్రజా రవాణా, సాంస్కృతిక కార్యక్రమాలు, దుకాణాలు, రెస్టారెంట్లు, స్పోర్ట్స్‌, థియేటర్లు, మాల్స్‌, పరిశ్రమలు, ప్రైవేటు, ప్రభుత్వ కార్యాలయాలు తెరిచేందుకు అనుమతి లభిస్తుంది. వివాహాలు, అంత్యక్రియలు ఎలాంటి నిబంధనలు లేకుండా సాధారణంగా జరుపుకునేందుకు అనుమతిస్తారు.

లెవెల్‌-2: ఐదు శాతం పాజిటివిటీ రేటు, ఆసుపత్రుల్లో 25-40 శాతం పడకలు నిండి ఉన్న జిల్లాలు లెవెల్‌2 కిందకు వస్తాయి. ఇక్కడ సెక్షన్‌ 144 అమల్లో ఉంటుంది. థియేటర్లు, రెస్టారెంట్లు, జిమ్‌లు, సెలూన్లు 50 శాతం సామర్థ్యంలో తెరవొచ్చు. ఇతర దుకాణాలు సాధారణ సమయాల్లో తెరిచి ఉంచేందుకు అనుమతి ఉంటుంది.

లెవెల్‌-3: పాజిటివిటీ రేటు 5 నుంచి 10 శాతం ఉండి, ఆక్సిజన్ బెడ్లు 40 శాతానికి మించి ఉండాలి. ఇటువంటి ప‌రిస్థితిలో సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే దుకాణాలను తెరిచేందుకు అనుమతిస్తారు. మాల్స్, థియేటర్లు మూసివేస్తారు. రెస్టారెంట్‌ల‌ను 50 శాతం సామర్థ్యంతో సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే నిర్వహించవచ్చు. బహిరంగ ప్రదేశాలను ఉదయం 5 గంటల నుంచి ఉదయం 9 గంటల వరకు తెరిచి ఉంచుతారు. 50 శాతం సామర్థ్యంతో ప్రైవేట్ కార్యాలయాలను సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే తెరవడానికి అనుమతినిస్తారు. వివాహ వేడుకల‌కు 50 మంది మాత్రమే హాజర‌య్యేందుకు అనుమ‌తినిస్తారు. అంత్యక్రియలకు 20 మంది మాత్ర‌మే హాజరు కావాల్సి ఉంటుంది. సెక్షన్‌ 144 అమల్లో ఉంటుంది.

లెవెల్‌-4: పాజిటివిటీ రేటు 10-20 శాతం, ఆసుపత్రుల్లో 60-75 శాతం పడకలు నిండి ఉన్న జిల్లాలు లెవెల్‌-4 కిందకు వస్తాయి. అన్ని నిత్యవసర దుకాణాలు సాయంత్రం 4 గంటల వరకు తెరిచి ఉంటాయి. సాయంత్రం 5 గంటలు, వారాంతాల్లో పూర్తిస్థాయి లాక్‌డౌన్ కొనసాగుతుంది. పారిశ్రామిక కార్యకలాపాలు, ప్రజా రవాణా 50శాతం సామర్థ్యంతో కొనసాగాలి. వివాహ వేడుకకు 25 మంది మాత్రమే హాజరుకావ‌చ్చు. అంత్యక్రియల్లో పాల్గొనేందుకు 20 మందికి మాత్రమే అనుమతి ఉంటుంది.

లెవెల్-5: పాజిటివిటీ రేటు 10-20 శాతం, ఆసుపత్రుల్లో 75 శాతం కంటే ఎక్కువ పడకలు నిండి ఉన్న జిల్లాలు లెవెల్‌-5 కిందకు వస్తాయి. ఈ జిల్లాల్లో పూర్తి స్థాయి లాక్‌డౌన్ కొనసాగుతుంది.త్యావ‌స‌ర‌ దుకాణాలు సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంటాయి. రెస్టారెంట్లకు ఫుడ్ డెలివరీ చేసే అవ‌కాశాన్ని క‌ల్పించ‌నున్నారు. మాల్స్, షాపింగ్ సెంటర్లు, జిమ్‌లు మూసివేసేవుంచుతారు.



సంబంధిత వార్తలు