Hinganghat Crime: ప్రేమించలేదని పెట్రోల్ పోసి తగలబెట్టాడు, మహారాష్ట్రలో దారుణం, పెళ్లయినా ప్రేమించాలంటూ వేధింపులు, కేసును సీరియస్‌గా తీసుకున్న మహారాష్ట్ర ప్రభుత్వం
యువతి తనను ప్రేమించలేదని యువకుడు పెట్రోలో పోసి నిప్పంటించాడు. వార్దా జిల్లాలోని హింగాన్‌ఘాట్‌లోని(Hinganghat) నందేరి చౌక్ వద్ద ఈ ఘటన జరిగింది. అతనికి పెళ్లయి భార్యా , 7 నెలల కొడుకు ఉన్నా ఆ యువతిని ప్రేమించాలంటూ వేధించాడు. పెళ్లై పిల్లాడు ఉన్న అతడి ప్రేమను ఆమె తిరస్కరించింది. ఇది తట్టుకోలేని అతడు ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు.
Wardha, Febuary 4: మహారాష్ట్రలో (Maharashtra) దారుణం చోటు చేసుకుంది. యువతి తనను ప్రేమించలేదని యువకుడు పెట్రోలో పోసి నిప్పంటించాడు. వార్దా జిల్లాలోని హింగాన్‌ఘాట్‌లోని(Hinganghat) నందేరి చౌక్ వద్ద ఈ ఘటన జరిగింది. అతనికి పెళ్లయి భార్యా , 7 నెలల కొడుకు ఉన్నా ఆ యువతిని ప్రేమించాలంటూ వేధించాడు. పెళ్లై పిల్లాడు ఉన్న అతడి ప్రేమను ఆమె తిరస్కరించింది. ఇది తట్టుకోలేని అతడు ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు.
అదనపు కట్నం కోసం కట్టుకున్న భార్యను చంపిన బ్యాంక్ మేనేజర్
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దడోరా గ్రామానికి చెందిన అంకిత(26)కి అదే గ్రామానికి చెందిన విక్కీ నగ్రారే (27) తో కొంతకాలంగా పరిచయం ఉంది. విక్కీ కి పెళ్ళై, ఏడు నెలల కొడుకు ఉన్నాడు. అంకిత ఓ కాలేజీలో లెక్చరర్ గా పని చేస్తోంది. ఆమెకు పెళ్లైంది. అయినా ప్రేమ పేరుతో ఆమెను వేధించటం మొదలు పెట్టాడు.
3 ఏళ్ల పాపపై అత్యాచారం, ఆపై హత్య
అతడి ప్రవర్తన నచ్చకపోవడంతో అంకిత అతడ్ని దూరం పెట్టింది. ఈ క్రమంలో విక్కీ సోమవారం ఉదయం అంకిత పనిచేసే కాలేజీవద్ద కాపు కాశాడు. ఆమె కాలేజీకి రాగానే ఆమెతో ఘర్షణకు దిగాడు. ఈ క్రమంలో తనతో తెచ్చుకున్న పెట్రోల్ ఆమెపై పోసి నిప్పంటించాడు.
ఎయిడ్స్ ఉందని చెప్పినా వదలని కామాంధులు
చుట్టుపక్కలవారు గమనించే లోపు అతను బైక్ పై అక్కడ్నించి పరారయ్యాడు. మంటల్లో చిక్కుకున్న అంకితను స్థానికులు ఆస్పత్రిలో చేర్పించి ప్రాధమికి చికిత్స చేయించారు. మెరుగైన వైద్యం కోసం నాగపూర్ తరలించారు. ప్రేమ విఫలం కావటంతోనే ఈ దాడికి పాల్పడినట్లు జిల్లా ఎస్పీ ( Vardha superintendent of police) తెలిపారు. పెళ్లైనా అతడి వేధింపులు మానలేదని కిందటి ఏడాది ఆత్మహత్యాయత్నం కూడా చేశాడని పోలీసులు తెలిపారు.
Here"s ANI Tweet
ఈ కేసును రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఈ ఘటనపై సత్వర విచారణ చేపడతామని నిందితుడిని కఠినంగా శిక్షిస్తామన హోంమంత్రి అనిల్ దేశ్ ముఖ్ (Home Minister) ప్రకటించారు. పరారీలో ఉన్న నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.