Patna, January 25: దేశంలో కామాంధులు రెచ్చిపోతున్నారు. ఎక్కడ చూసినా అత్యాచార ఘటనలే కనిపిస్తున్నాయి. మహిళ ఒంటరిగా కనిపిస్తే చాలు..కామాంధులు బరి తెగించి వారిపై గ్యాంగ్ రేప్ కు పాల్పడుతున్నారు. తాజాగా బయటకు వచ్చిన ఓ ఘటన గురించి తెలుసుకుంటే దేశంలో కామాంధులు ఇలా కూడా ఉంటారా అని అనిపించక మానదు. వివరాల్లోకెళితే..
బీహార్ రాష్ట్రంలో (Bihar) ఓ మహిళకు ఎయిడ్స్ ఉందని తెలిసినా కూడా ఆమెను కామాంధులు వదల్లేదు. ఆమె మీద నలుగురు కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బీహార్‌లోని కైమూర్ జిల్లాకు (Kaimur district) చెందిన ఓ మహిళ గయాలోని ఓ ఆస్పత్రిలో చికిత్స చేయించుకుని తిరిగి ఇంటికి వెళ్లాలనుకుంది. అయితే, ఆ రోజు రాత్రి కావడంతో ఇంటికి వెళ్లే సమయంలో పాట్నా - బభువా ఇంటర్ సిటీ (Patna-Bhabhua intercity express) ఎక్కింది. యువతి ఒంటరిగా ఉన్న విషయాన్ని గమనించిన నలుగురు యువకులు ఆమె ఉన్న బోగీలోకి ఎక్కారు.
రాత్రి సమయం కావడంతో ఆ బోగీలో ప్రయాణికులు ఎవరూ లేరు. ఇది అదనుగా భావించిన ఆ నలుగురు కామాంధులు బోగీకి లోపలి నుంచి తలుపులు మూసేశారు. ఆ విడో మహిళపై సామూహిక అత్యాచారానికి (Widow Gang Raped) పాల్పడ్డారు. అయితే, రాత్రి సమయంలో స్టేషన్‌లో ఆగిన రైలును చెక్ చేస్తున్న పోలీసులకు బోగీ తలుపులు వేసి ఉండడంతో అనుమానం వచ్చింది. దీంతో వారు గట్టిగా తలుపులు బాదారు.
ఆ సమయంలో అత్యాచారం చేసిన నిందితులు అక్కడి నుంచి పారిపోబోయారు. తలుపులు తీసి మరో రూట్‌లో పారిపోతుండగా పోలీసులు (GRP ) ఒక నిందితుడిని పట్టుకున్నారు. మరో ముగ్గురు నిందితులు పారిపోయారు. బాధితురాలు పోలీసు విచారణలో పలు విషయాలను వెల్లడించింది. తనకు ఎయిడ్స్ (AIDS) ఉందన్న విషయాన్ని వారికి చెప్పినా కూడా వినకుండా తన మీద అత్యాచారానికి పాల్పడ్డారని బాధితురాలు (Rape victim) వాపోయింది. ఇదిలా ఉంటే ఆమె భర్త కొన్ని రోజుల క్రితమే ఎయిడ్స్ బారిన పడి చనిపోయాడు.