Maharashtra COVID-19: మహారాష్ట్రలో కరోనా కల్లోలం, మంత్రికి కరోనా పాజిటివ్, పోలీస్ నుంచి మంత్రికి సోకిన కోవిడ్-19, రెండు వారాల పాటు క్వారంటైన్‌లోకి మంత్రి ఫ్యామిలీ

ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా పాజిటివ్‌ కేసుల సంఖ్య ఆరువేలు దాటడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. తాజాగా రాష్ట్ర మంత్రి జితేంద్ర అవద్‌కు (maharashtra minister corona positive) కూడా వైరస్‌ సోకినట్లు రాష్ట్ర వైద్య,ఆరోగ్యశాఖ అధికారులు ధృవీకరించారు. రాష్ట్ర గృహ నిర్మాణశాఖ మంత్రి నివాసంలో విధులు నిర్వర్తిస్తున్న సెక్యూరిటీ సిబ్బందిలో ఒకరికి ఇటీవల కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో మంత్రితో పాటు కుటుంబ సభ్యులంతా రెండు వారాల పాటు స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. అనంతరం పరీక్షలు నిర్వహించగా వాందరికి కరోనా నెగిటివ్‌గా తేలింది.

Image used for representational purpose | (Photo Credits: Pixabay)

Mumbai, April 24: మహారాష్ట్రలో కరోనా వైరస్‌ (Maharashtra Coronavirus) విజృంభిస్తోంది. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా పాజిటివ్‌ కేసుల సంఖ్య ఆరువేలు దాటడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. తాజాగా రాష్ట్ర మంత్రి జితేంద్ర అవద్‌కు (maharashtra minister corona positive) కూడా వైరస్‌ సోకినట్లు రాష్ట్ర వైద్య,ఆరోగ్యశాఖ అధికారులు ధృవీకరించారు. రాష్ట్ర గృహ నిర్మాణశాఖ మంత్రి నివాసంలో విధులు నిర్వర్తిస్తున్న సెక్యూరిటీ సిబ్బందిలో ఒకరికి ఇటీవల కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో మంత్రితో పాటు కుటుంబ సభ్యులంతా రెండు వారాల పాటు స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. అనంతరం పరీక్షలు నిర్వహించగా వాందరికి కరోనా నెగిటివ్‌గా తేలింది. కేరళలొ నెలల పసిపాపను చంపేసిన కరోనా, ఇండియాలో 23 వేలు దాటిన కోవిడ్-19 కేసులు, 718కి చేరిన మృతుల సంఖ్య

మంత్రి జితేంద్ర అధికారులతో సమీక్ష సందర్భంగా ఓ పోలీసు అధికారితో భేటీ అయ్యారు. ఈ క్రమంలోనే ఓ వారం తరువాత ఆ పోలీసు అధికారికి కరోనావైరస్‌ పాజిటివ్‌గా తేలింది. దీంతో మంత్రికి కూడా వైద్య పరీక్షలు నిర్వహించగా పోలీసు నుంచి జితేంద్రకు వైరస్‌ సోకినట్లు అధికారులు గుర్తించారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులతో పాటు మరికొంత మందిని వైద్య పరీక్షలుకు తలించారు. మంత్రికి సమీపంగా మెలిగిన వారందరినీ క్వారెంటైన్‌కు తరలిస్తున్నారు.

54 ఏళ్ల ఈ ఎన్సీపీ నేత (Nationalist Congress Party) థానేలోని ఓ ప్రయివేట్ హాస్పిటల్‌లో చేరారు. ఏప్రిల్ 13న నిర్వహించిన పరీక్షల్లో ఆయనకు కరోనా నెగటివ్ రాగా ఇప్పుడు పాజిటివ్ రావడం గమనార్హం. ఆయనతోపాటు నిత్యావసరాలను పంపిణీ చేసిన 36 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. ఏప్రిల్ 17న వారికి నెగటివ్ అని రిపోర్ట్ వచ్చింది. కాగా వైరస్‌ సోకిన పోలీసు అధికారి కదలికలపై కూడా అధికారులు దృష్టి సారించారు. ఢిల్లీ మర్కజ్‌కు వెళ్లిన వారిని గుర్తించడంలో ఆయన కీలకంగా వ్యవహరించారని, మత ప్రార్థనలకు వెళ్లిన వారి ప్రాంతాల్లో ఆయన ఎ‍క్కువగా పర్యటించారని పోలీస్ట్‌ స్టేషన్‌ సిబ్బంది చెబుతోంది. కరోనా కట్టడిలో ముందడుగు, 12 జిల్లాల్లో కొత్త కేసులు లేవు, 78 జిల్లాల్లో 14 రోజుల నుంచి తాజా కేసులు లేవు

కాగా ముంబ్రాలో తబ్లీగీ జమాత్ సభ్యులను పట్టుకునే ఆపరేషన్లో ఈ ఆఫీసర్ పాల్గొన్నారు. ఢిల్లీ తబ్లిగీ విషయం వెలుగు చూశాక.. 13 మంది బంగ్లాదేశీయులు, 8 మంది మలేసియన్లను ముంబ్రాలో అదుపులోకి తీసుకున్నారు. వారి ద్వారా కొందరు ముంబ్రా వాసులకు కరోనా వచ్చి ఉంటుందని.. వారి నుంచి ఈ ఆఫీసర్‌కు సోకి ఉంటుందని అనుమానిస్తున్నారు. సదరు పోలీసు ఆఫీసర్‌కు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ కావడంతో మంత్రి సహా ఆయనతో కాంటాక్ట్ అయిన 100 మందికి థానే మున్సిపల్ అధికారులు కరోనా పరీక్షలు నిర్వహించారు.

మహారాష్ట్రలో ఒక్కరోజే కొత్తగా 778 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం ఆందోళనకు గురిచేస్తోంది. తాజాగా 14 మంది కరోనా బారిన పడి మరణించినట్లు ప్రభుత్వం పేర్కొంది. మహారాష్ట్రలో ఇప్పటివరకూ 840 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయినట్లు ప్రభుత్వం ప్రకటించింది. మహారాష్ట్రలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య ఇప్పటికి 6,427కు చేరింది. దేశంలో అత్యధిక కరోనా పాజిటివ్ కేసులు మహారాష్ట్రలోనే నమోదవుతుండటం గమనార్హం.

మహారాష్ట్రలో ప్రధానంగా ముంబై, పుణె నగరాలు కరోనా ప్రభావంతో చిగురుటాకుల్లా వణుకుతున్నాయి. ఒక్క ముంబైలోనే ఇప్పటిదాకా 3600 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 161 మంది కరోనా బారిన పడి మరణించారు. పుణెలో కూడా 851 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 62 మంది మరణించారు. అతిపెద్ద మురికివాడగా చెప్పుకునే ముంబైలోని ధారావిలో గురువారం కొత్తగా 25 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో.. ధారావిలో కేసుల సంఖ్య 214కు చేరింది.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif