COVID-19 in India: కేరళలొ నెలల పసిపాపను చంపేసిన కరోనా, ఇండియాలో 23 వేలు దాటిన కోవిడ్-19 కేసులు, 718కి చేరిన మృతుల సంఖ్య
India’s COVID-19 Tally Rises to 23,077 With 1684 New Cases in Past 24 Hours, Death Toll Mounts to 718 (photo-PTI)

New Delhi, April 24: ఇండియాలో కరోనా వైరస్‌ (Deadly COVID-19 in India) చాప కింద నీరులా విస్తరిస్తోంది. గడిచిన 24 గంటల్లో భారత్‌లో (India) కొత్తగా 1,684 కరోనా కేసులు నమోదైనట్టుగా కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 23,077కి చేరింది. ఇప్పటివరకు కరోనా (Coronavirus in India) నుంచి 4,749 మంది కోలుకున్నారు. గత 24 గంటల్లో కరోనాతో 37 మంది మరణించడంతో.. మొత్తం మృతుల సంఖ్య 718కి చేరింది. కరోనా కట్టడిలో ముందడుగు, 12 జిల్లాల్లో కొత్త కేసులు లేవు, 78 జిల్లాల్లో 14 రోజుల నుంచి తాజా కేసులు లేవు

ప్రస్తుతం భారత్‌లో 17,610 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. అత్యధికంగా మహారాష్ట్రలో 6,430 కరోనా కేసులు నమోదు కాగా, 283 మంది మరణించారు. ఆ తర్వాత గుజరాత్‌లో 2,624, ఢిల్లీలో 2,376, రాజస్తాన్‌లో 1,964, మధ్యప్రదేశ్‌లో 1,699, తమిళనాడులో 1,683, ఉత్తరప్రదేశ్‌లో 1,510 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

కేరళలో నెలలు నిండని ఓ చిన్నారిని కరోనా మహమ్మారి బలితీసుకుంది. మలప్పురం జిల్లాలోని మంజేరికి చెందిన నాలుగు నెలల చిన్నారికి అధిక జ్వరం, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు ఏర్పడటంతో తల్లిదండ్రులు ఈ నెల 21 న కోజికోడ్‌ మెడికల్‌ కళాశాల ఆసుపత్రిలో చేర్పించారు. పరీక్షల అనంతరం బుధవారం పాపకు కరోనా పాజిటివ్‌గా తేలింది. కాగా చికిత్స పొందుతున్న చిన్నారి దురదృష్టవశాత్తు శుక్రవారం ఉదయం మరణించింది. మలప్పురం జిల్లాలో ఇప్పటి వరకు 20 మందికి కరోనా పాజిటివ్‌గా నమోదైంది. మాయమైన చైనా జర్నలిస్ట్ మళ్లీ ప్రత్యక్షం, వుహాన్‌లోని వైరాలజీ ల్యాబ్‌ను సందర్శించిన తరువాత మాయం, క్వారంటైన్‌లోకి తీసుకువెళ్లారని వెల్లడించిన లీ జహువా

కేరళలో గురువారం కొత్తగా కేవలం 10 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య 447 ఉండగా ఆక్టివ్‌ కేసుల సంఖ్య 129 గా ఉంది. అంతేగాక 23 వేల మంది క్వారంటైన్‌లో ఉన్నట్లు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ తెలిపారు. కొత్తగా నమోదైన కేసులలో ఇడుక్కి జల్లా నుంచి నాలుగు, కోజికోడ్‌, కొట్టాయం నుంచి రెండు, తిరువనంతపురం, కొల్లం నుంచి ఒక్కొక్కటి చొప్పున నమోదైనట్లు సీఎం పేర్కొన్నారు. కాగా 14 రోజుల నుంచి ఒక్క కొత్త కేసు కూడా నమోదవ్వకపోవడంతో మంగళవారం గ్రీన్ జోన్‌గా ప్రకటించిన కొట్టాయం గడిచిన రెండు రోజుల్లో ఒక్కొక్క కేసును నమోదు చేసింది