Section 144 Imposed in Mumbai:ముంబైలో కోవిడ్ ఆంక్షలను కఠినతరం, 144 సెక్షన్ విధిస్తూ ఉత్తర్వులు, న్యూఇయర్ వేడుకలపై ఆంక్షలు, బయట కనిపిస్తే బాదుడే అంటున్న ముంబై పోలీసులు
దీంతో 144 సెక్షన్‌ను(Section 144 imposed) కఠిన ఆంక్షలను(prohibitory orders) అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా నూతన మార్గదర్శకాలను, నియమాలను జారీ చేశారు.
Mumbai December 16: ముంబై(Mumbai)లో ఒమిక్రాన్(Omicron) వ్యాప్తి కట్టడి కోసం కఠిన చర్యలు చేపడుతున్నారు అధికారులు. పండగ సీజన్‌తో పాటూ, న్యూ ఇయర్(New Year) ఉండటంతో భారీగా ప్రజలు గుమికూడే అవకాశాలు ఉన్నాయి. దీంతో 144 సెక్షన్‌ను(Section 144 imposed) కఠిన ఆంక్షలను(prohibitory orders) అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా నూతన మార్గదర్శకాలను, నియమాలను జారీ చేశారు. ఈ నూతన మార్గదర్శకాలు గురువారం నుంచి అమల్లోకి వచ్చాయి. రాబోయే రోజుల్లో జరిగే వివాహాలు(marriages), ఇతర వేడుకలపై ఆంక్షల ప్రభావం పడనుంది.
ముఖ్యంగా దేశంలో నమోదయ్యే ఒమిక్రాన్(Omicron) కేసులలో సుమారు 50 శాతం మహారాష్ట్ర(Maharashtra)లోనే వస్తున్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ముఖ్యంగా డిసెంబర్ 31 వేడుకలు, ఇతర కార్యక్రమాలతో ఒమిక్రాన్ విస్తరించే అవకాశాన్ని దృష్టిలో పెట్టుకుని 16 నుంచి 31 వరకు ఈ నూతన నిబంధనలను అమలు చేయనున్నారు. అంతేగాక, ఇప్పటికే అమలులో ఉన్న నియమాలను ప్రజలు పాటిస్తున్నారా లేదా అనే విషయాన్ని కూడా పోలీసులు పరిశీలించనున్నారు.
ముంబైలో అయిదు వేల మంది కాలపరిమితి పూర్తయినప్పటికీ రెండో డోస్(Covid second dose) తీసుకోలేదు. రెండు డోసులు తీసుకుంటేనే కరోనా నుంచి పూర్తి స్థాయి రక్షణ లభిస్తుందనీ, దీన్నొక కర్తవ్యంగా భావించి ప్రతి ఒక్కరూ తప్పకుండా వ్యాక్సిన్(Vaccine) వేయించుకోవాలని మునిసిపల్ అధికారులు కోరుతున్నారు. ముఖ్యంగా బస్సుల్లో పెరుగుతున్న రద్దీ నేపథ్యంలో కరోనా టీకా రెండు డోసులు వేసుకున్నవారు మాత్రమే ప్రయాణం చేయాలని చెబుతున్నారు. ప్రతి రోజూ బెస్ట్ బస్సుల్లో 28 లక్షల మంది ప్రయాణం చేస్తున్నారనీ, కరోనాను అరికట్టేందుకు ప్రజలు సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.