Maharashtra Shocker: టీచర్ కాదు కామాంధుడు, ట్యూషన్ పేరుతో బాలికపై తొమ్మిది ఏళ్ల నుంచి అత్యాచారం

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, అనిల్ పరదేశి అనే నిందితుడు తన భార్యతో కలిసి ట్యూషన్ క్లాసులు నడుపుతున్నాడు,

Credits: Google

Mumbai, July 24: గత తొమ్మిదేళ్లుగా 16 ఏళ్ల బాలికపై వేధింపులకు పాల్పడి, అత్యాచారం చేసిన ఆరోపణలపై 55 ఏళ్ల ప్రైవేట్ ట్యూషన్ టీచర్‌ను ముంబై పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, అనిల్ పరదేశి అనే నిందితుడు తన భార్యతో కలిసి ట్యూషన్ క్లాసులు నడుపుతున్నాడు. అతని ఈ దారుణం గురించి ఆమెకు తెలియకపోవడం ఆశ్చర్యకర అంశం. బాలికకు ఆరేళ్ల వయసులో అతడు మొదట వేధించడం ప్రారంభించాడని పోలీసులు తెలిపారు.

నిందితుడిపై బాలిక తండ్రికి ఉన్న నమ్మకం కూడా బాలికను ఇంత కాలం వేధించడానికి అతనికి సహాయపడిందని, బాలిక తన కష్టాలను తన కుటుంబ సభ్యులతో పంచుకోవడానికి ఇష్టపడలేదని పోలీసులు వివరించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమ బెంగాల్‌కు చెందిన బాలిక ముంబైలో తన తండ్రి, ఇద్దరు తోబుట్టువులతో నివసిస్తుంది. ఆమె తల్లి.. తండ్రి నుండి విడిపోయింది.

దారుణం, భార్యను చంపి రాత్రంతా శవం పక్కనే భర్త, అర్థరాత్రి ఇంటికి వస్తే భోజనం వడ్డించకపోవడంతో బండతో కొట్టి హత్య

దాదాపు తొమ్మిదేళ్లుగా నిందితుడు బాలికపై వేధింపులకు పాల్పడ్డారు. బాలిక తన కష్టాలను ఎవరితోనైనా పంచుకుంటుందనే భయంతో ఆమెను పాఠశాలకు వెళ్లకుండా చేశాడు .అక్కడ చెడు ప్రభావం, తన కుమార్తెను చెడగొట్టగలదని ఆమె తండ్రిని ఒప్పించి ఆమె పాఠశాలకు వెళ్లకుండా చేశాడు. నిందితుడు బాలికకు రుతుక్రమం వచ్చినప్పుడు గర్భం రాకుండా మందులు కూడా ఇచ్చాడు. అప్పుడు కూడా లైంగిక వేధింపులకు పాల్పడేవాడు.

ప్రస్తుతం 10వ తరగతి చదువుతున్న ఆ బాలిక గత మూడేళ్లుగా పాఠశాలకు స్వస్తి పలికి ట్యూషన్‌కు మాత్రమే వెళ్లేలా టీచర్ తయారుచేశాడు. ఆమె తండ్రి కొన్ని వ్యక్తిగత పనుల నిమిత్తం బెంగాల్‌లో ఉన్న సమయంలో నిందితుడు దాదాపు ప్రతిరోజూ అమ్మాయిపై అత్యాచారానికి పాల్పడేవాడు. అయితే పాఠశాల నుండి అమ్మాయి స్నేహితులు వచ్చి ఆమెను స్కూలుకు ఎందుకు రావడం లేదని అడిగారు.

నిందితుడు తన ఇంట్లోనే ఆమెను తిట్టడం స్నేహితులు చూశారు. దీనిపై ఎందుకు మాట్లాడటం లేదని వారు ఆమెను అడిగినప్పుడు, బాలిక వారితో తన సంవత్సరాల లైంగిక వేధింపులు, హింస గురించి వివరించింది. దీంతో వారు ఆమెను తన తండ్రికి చెప్పి పోలీసులను ఆశ్రయించేలా ఒప్పించారు.తరువాత, నిందితుడిని అరెస్టు చేసి, ఎల్‌టి మార్గ్ పోలీస్ స్టేషన్‌లో భారతీయ శిక్షాస్మృతి (ఐపిసి), లైంగిక నేరాలకు వ్యతిరేకంగా పిల్లల రక్షణ (పోక్సో) చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన తర్వాత జ్యుడీషియల్ కస్టడీకి పంపారు.