Mumbai Shocker: మందులోకి బిర్యానీ వండలేదని భార్యను కత్తితో దారుణంగా పొడిచి చంపిన భర్త, చికిత్స పొందుతూ బాధితురాలు మృతి

ఆగ‌స్టు 31వ తేదీన విక్ర‌మ్ పీక‌ల దాకా మ‌ద్యం సేవించి ఇంటికొచ్చాడు.

Image used for representational purpose only | (Photo Credits: PTI)

Mumbai, Sep 6: మ‌ద్యానికి బానిసైన ఓ భ‌ర్త త‌న‌కు బిర్యానీ వండ‌లేద‌నే కోపంతో భార్య‌పై దాడి చేసి (Mumbai Man Stabs Wife) చంపాడు. మహారాష్ట్రలోని లాతూర్ జిల్లాలో విందు కోసం బిర్యానీ తయారు చేయలేదని మత్తులో ఉన్న వ్యక్తి తన భార్యను కత్తితో పొడిచి గాయపరిచినట్లు పోలీసులు మంగళవారం తెలిపారు. ఆగస్ట్ 31న నాందేడ్ రోడ్ ఏరియాలోని కుష్టడం వద్ద జరిగిన ఈ ఘటనకు సంబంధించి నిందితుడు విక్రమ్ వినాయక్ దేడేపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు ఇన్‌స్పెక్టర్ సుధాకర్ బావ్కర్ తెలిపారు.

ఆగస్టు 31వ తేదీ రాత్రి మద్యం మత్తులో ఇంటికి వచ్చిన నిందితుడు రాత్రి భోజనానికి బిర్యానీ తయారు చేయలేదని భార్యతో గొడవ పడ్డాడని తెలిపారు.ఇతర కుటుంబ సభ్యులు అడ్డుకునేందుకు ప్రయత్నించగా నిందితుడు అతని భార్యను కొట్టాడు. అనంతరం కత్తి తీసుకుని ఆమెను పొడిచాడు.

పాటలు పాడుతుందని భార్యను కత్తితో పొడిచి చంపేసిన భర్త, అరెస్ట్ చేసిన బీహార్ పోలీసులు

దాడిలో తీవ్రంగా గాయపడిన బాధితుడిని చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించామని, ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదని అధికారి తెలిపారు.కాగా బాధితురాలు చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘ‌ట‌న మ‌హారాష్ట్ర‌లోని లాతూర్ జిల్లాలో ఆగ‌స్టు 31న చోటు చేసుకోగా, ఆల‌స్యంగా వెలుగు చూసింది.