Pune: పానీపూరి తెచ్చిన భర్త, నన్ను అడక్కుండా ఎందుకు తెచ్చావని భార్య ఆత్మహత్య, పుణేలో విషాద ఘటన, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
దీనికి కారణం తన భర్త తన పర్మిషన్ లేకుండా తినడానికి పానీపూరి తెచ్చాడనే ( buying Pani Puri for dinner) ఒకే ఒక రీజన్. ఈ విషాద ఘటన మహారాష్ట్రలోని పుణేలో చోటు చేసుకుంది
Pune, Sep 1: పూణేలో ఒక మహిళ తన భర్తతో గొడవ పడి (Upset with husband) తనువు చాలించింది. దీనికి కారణం తన భర్త తన పర్మిషన్ లేకుండా తినడానికి పానీపూరి తెచ్చాడనే ( buying Pani Puri for dinner) ఒకే ఒక రీజన్. ఈ విషాద ఘటన మహారాష్ట్రలోని పుణేలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...షోలాపూర్‌కు చెందిన ఘహినినాథ్ అంబదాస్ 2019లో సరవాదే అనే మహిళను వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. ఆమె భర్త పూణే లో ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ప్రస్తుతం వీరు పూణేలోని అంబేగావ్ పీఠభూమి ప్రాంతంలో నివసిస్తున్నారు.
కాగా వివాహమైనప్పటి నుంచి ఘహినీనాథ్ కు ప్రతీక్ష మధ్య చాల విభేదాలు ఉన్నాయి. ఈ క్రమంలో గత శుక్రవారం గహినీనాథ్ ఆఫీసు నుంచి ఇంటికి వస్తున్న సమయంలో పానీ పూరి తీసుకుని ఇంటికి వెళ్లాడు. అయితే తనను అడగకుండానే పానీ పూరిని తీసుకువచ్చినందుకు సరవాదేకు కోపం వచ్చింది. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
ఈ క్రమంలో మరుసటి రోజు భార్య విషం తాగి ఆత్మహత్యకు (woman ends her life) పాల్పడింది. సరవాదే తండ్రి ప్రకాష్.. భారతి విద్యాపీఠ్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి భర్త ఘహినీనాథ్‌పై ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా పూణేలో జాబ్ ఇష్టం లేదని పాత చోటుకే వెళదామని నా భార్య నాతో నిరంతరం గొడవపడేదని భాదిత భర్త ఆరోపిస్తున్నారు.